హైదరాబాద్ లో హై టెన్షన్ : 3 కరోనా అనుమానిత కేసులు

హైదరాబాద్ లో హై టెన్షన్ : 3 కరోనా అనుమానిత కేసులు
x
Highlights

కొన్ని రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికిస్తున్న కరోనా వైరస్ అతి వేగంగా దేశాలను దాటి వ్యాప్తి చెందుతుంది.

కొన్ని రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికిస్తున్న కరోనా వైరస్ అతి వేగంగా దేశాలను దాటి వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రంలోనే పరీక్షలు చేసి వారిని పట్టణాల్లోకి అనుమతిస్తున్నారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వారికి చికిత్సలు చేయిస్తున్నారు. వైరస్ సోకినవారికి ప్రత్యేకంగా చికిత్స అందించడానికి గాను నల్లకుంట ఫీవర్‌ఆస్పత్రిలోని 7వ వార్డును(ఐసోలేటెడ్‌) సిద్ధం చేశారు.ఇక ఈ వైరస్ ఎక్కడ పట్టణంలో వ్యాప్తి చెంది అందరికీ సోకుతుందో అని ప్రజలు తీవ్ర భయాందోళలనకు గురవుతున్నారు.

ఇక ఇదే నేపథ్యంలో చికిత్సల నిమిత్తం నగరంలోని ముగ్గురికి కరోనా వైరస్‌సోకినట్లుగా అనుమానిస్తున్నారు. వారికి సంబంధించిన బ్లడ్ శాంపిళ్లను సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల కాలంలోనే జూబ్లీహిల్స్ లో నివసించే అమర్‌నాథ్‌రెడ్డి (25) చైనా నుంచి నగరానికి వచ్చాడు. అక్కడినుంచి వచ్చిన రోజు బాగాను ఉన్న అతను అనుకోకుండా శనివారం అస్వస్థతకు గురయ్యాడు. తరువాత కాస్త కోలుకున్న అతను వెంటనే తనకు తానుగా స్వచ్చందంగా ఫీవర్‌ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చాడు. దీంతో వైద్యులు అతడిని పరీక్షించి కరోనా అనుమానిత కేసుగా పరిగణించారు. దీంతో అతన్ని వెంటనే ఐసోలేటెడ్‌వార్డులో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స అందజేస్తున్నారు.

ఇదే తరహాలో ఆదివారం రోజున మరో 2 కరోనా అనుమానిత కేసులు ఆస్పత్రికి చేరుకున్నాయిని వైద్య అధికారులు తెలిపారు. ఇక ఈ ముగ్గురినీ ప్రత్యేకంగా ఐసోలేటెడ్‌వార్డు లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఈ ముగ్గురి నుంచి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపించామని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌డాక్టర్‌కె.శంకర్‌మీడియాకు తెలిపారు. ఇకపోతే గత వారం రోజులుగా ఈ కరోనా వైరస్ గురించి ప్రసార మాధ్యమాల్లో ప్రచారం సాగుతుండడంతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు.

ఎవరికైనా కాస్త ఫ్లూ లక్షణాలు అనిపిస్తే స్వచ్చందంగా వారే ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారని వైద్యాధికారులు తెలిపారు. అంతే కాకుండా ఎవరికైనా ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వారి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. పరీక్షల్లో కరోనా వైరస్ లేదని తేలేంత వరకూ వారి కుటుంబసభ్యులను ఇళ్లలోనే ఉంచాలని ఆదేశాలు జారీచేసింది. ఇక ఈ వైరస్ లక్షణాలు కనిపించడానికి దాదాపుగా రెండువారాలు పడుతుందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories