'జినోమ్‌' అవార్డు గ్రహీతలు ఎవరో తెలుసా?

జినోమ్‌ అవార్డు గ్రహీతలు ఎవరో తెలుసా?
x
Highlights

కేన్సర్ ఇది ఒక భయంకరమైన మహమ్మారి. ఇప్పటి కాలంలో ఈవ్యాధి సోకిందంటే చాలు దానికి వైద్యం, మందులు అందుబాటులో లేక ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు.

కేన్సర్ ఇది ఒక భయంకరమైన మహమ్మారి. ఇప్పటి కాలంలో ఈవ్యాధి సోకిందంటే చాలు దానికి వైద్యం, మందులు అందుబాటులో లేక ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కానీ కాలానుగుణంగా అన్ని రోగాలకు, వైద్యాన్ని, అందుకు కావలసిన మందులను కనిపెట్టారు పరిశోధకులు, వైద్యులు. అదే విధంగా కాన్సర్ కి కూడా వైద్యాన్ని మందులకు కనుగొన్నారు. అంతే కాక వైద్యాన్ని దినదినాభివృద్ది చేస్తూ నూతన టెక్నాలజీని కూడా కనిపెట్టారు.

ఇప్పుడు ఇలాంటి వారికోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే బయో ఆసియా ప్రకటించే జినోమ్‌ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులను ఈ ఏడాది కూడా ప్రకటించింది. ఈ బయో ఆసియా సమావేశాన్ని ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ఆసియా మొత్తానికి అతిపెద్ద జీవశాస్త్ర సంబంధిత వేదికగా పరిణమించిన ఈ వేదికపై ఈ ఏడాది అమెరికా శాస్త్రవేత్త డాక్టర్‌ కార్ల్‌ హెచ్‌.జూన్ ఈ అవార్డును అందుకోనున్నారు.

ఈయన ఫార్మా రంగంతోపాటు, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలపై కూడా ఎంతో కృషి చేసారు. అదే విధంగా ప్రజారోగ్య రంగంలో విశేష కృషి చేసిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్‌ సీఈవో డాక్టర్‌ వాస్‌ నరసింహన్‌లు ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయాన్ని బయో ఆసియా నిర్వాహకులు ప్రకటిం చారు. వీరు కేన్సర్‌ మహమ్మారికి వినూత్న చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కార్ల్‌ హెచ్‌.జూన్‌కు, ఆరోగ్య రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన వాస్‌ నరసింహన్‌లకు బయో ఆసియా తొలిరోజున అవార్డులు అందిస్తామని వివరించారు.

ఇక పొతే కార్ల్‌ జూన్‌ కాన్సర్ రోగ నిరోధక వ్యవస్థ కణాల్లో (టి-సెల్స్‌) కొన్ని మార్పులు చేయడం ద్వారా అవి కేన్సర్‌ కణాలను గుర్తించి మట్టుబెట్టేలా చేయగలిగారు. ఈ వైద్యాన్నేఇమ్యూనోథెరపీ అని పిలుస్తారు. ఈ వైద్యంలో టి–సెల్స్‌ ఉపరితలానికి కైమెరిక్‌ యాంటిజెన్‌ రిసెప్టర్లను అనుసంధానిస్తారు దీంతో ఇవి కేన్సర్‌ కణాలను గుర్తించే శక్తిని పొందుతాయని తెలిపారు. కార్ల్‌ జూన్‌ పరిశోధనల ఆధారంగా అభివృద్ధి చెందిన టిసాజెన్‌లిక్లుయి అనే ఎఫ్‌డీఏ ఆమోదిత జన్యు చికిత్స అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎంతో మంది కాన్సర్ రోగులకు వైద్యం అందించి వారికి నయం చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories