సాగర్ ‌ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఆరుగురు గల్లంతు

సాగర్ ‌ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఆరుగురు గల్లంతు
x
Highlights

మిత్రుడి వివాహానికి హాజరై వస్తుండగా పెనువిషాదం జరిగింది. ఫ్రెండ్‌ మహేష్‌ పెళ్లిని గ్రాండ్‌గా జరిపించేందుకు హైదరాబాద్‌కు చెందిన స్నేహితులు రెండు...

మిత్రుడి వివాహానికి హాజరై వస్తుండగా పెనువిషాదం జరిగింది. ఫ్రెండ్‌ మహేష్‌ పెళ్లిని గ్రాండ్‌గా జరిపించేందుకు హైదరాబాద్‌కు చెందిన స్నేహితులు రెండు కార్లలో వెళ్లారు. బంధువులు, కుటుంబసభ్యుల మధ్య పెళ్లి వైభవంగా జరిపించారు. అనంతరం నిర్వహించిన బరాత్‌లో అందరూ కలిసి సంతోషంగా చిందులేశారు. ఆ అనందాన్ని మనసులో నింపుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. పెళ్లిముచ్చటలు చెప్పుకుంటూ ముందుకు సాగిన వారు చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో వాహనం అదుపుతప్పి ఎన్నెస్పీ కాల్వలో పడిపోయిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.

కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం చాకిరాల దగ్గర వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం అదుపుతప్పి నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వెనుక మరో వాహనంలో వచ్చిన మిత్రులు ఈ ఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సాగర్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాదంలో గల్లంతైన వారు ఏఎస్ రావు నగర్‌లో ఉన్న అంకుర్ హాస్పిటల్‌లో పని చేస్తున్నారు.

ఇటు విషయం తెలుసుకుని గల్లంతయిన వారి కుటుంబ సభ్యులు ఆందోళనగా అంకుర్ ఆస్పత్రికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, సూర్యాపేట కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ భాస్కరన్ చాకిరాలకు వెళ్లి ప్రమాదంపై ఆరాతీశారు. కాల్వలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటి విడుదలను నిలిపివేయించారు. మునగాల సీఐ శివశంకర్‌గౌడ్, నడిగూడెం ఎస్సై నరేశ్ తమ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories