బీభత్సం సృష్టించిన కారు

బీభత్సం సృష్టించిన కారు
x
Highlights

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు, కారు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి.

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు, కారు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. అతివేగం ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. కొంత మంది యువత మద్యం సేవించి, చరవాణుల్లో మాట్లాడుతూ అతివేగంగా వాహనాలను నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదాల్లో కొంత మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొంత మంది గాయాలతో బయటపడినప్పటికీ భవిష్యత్తులో పని చేయడానికి కూడా రాకుండా నిర్జీవుల్లా ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక వాహనాలు అతివేగంగా నడిపించడం వలన రోడ్డున పోయే పాదాచారులు అటువైపుగా వెలుతున్న వారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు వారి జీవనాధారన్ని కోల్పోతున్నారు.

ఇదే కోణంలో తాగిన మైకంలో వాహనాన్ని నడపడంతో కారు ఫుట్‌ పాత్‌పైకి దూసుకెళ్లింది ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అత్తాపూర్ కు చెందిన మగ్గురు యువకులు ఏపీ 09 ఏపీ 0815 నెంబరు గల కారు కారులో వెలుతున్నారు. అతి వేగంతో వెళ్లి రోడ్డు పక్కన పార్క్‌ చేసిన మరో కారును ఢీ కొట్టింది.

దీంతో అదుపుతప్పిన కారు ఫుట్‌ పాత్‌పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో రోడ్లను శుభ్రం చేస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం కారులోని యువకులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. యువకులు మద్యం మత్తులో కారును నడిపిస్తున్నారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories