Top
logo

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
Highlights

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెంబర్ 3 లోని రాయల్ టిఫిన్ సెంటర్ లోకి దూసుకుపోయింది.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెంబర్ 3 లోని రాయల్ టిఫిన్ సెంటర్ లోకి దూసుకుపోయింది. అతివేగంగా వచ్చిన కారు.. టిఫిన్ సెంటర్ కాంపౌండ్ వాల్ ను ఢీ కొట్టింది. అయితే ప్రమాదం సమయంలో టిఫిన్ సెంటర్ దగ్గర కొద్ది మందే ఉండటంతో.. భారీ ప్రమాదం తప్పింది.

అయితే మద్యం మత్తులోనే కారు డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే.. అందులోని యువకులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. కారులో ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో.. కార్లో ఉన్న వారికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.



Web TitleCar Accident at Banjara hills in Hyderabad
Next Story


లైవ్ టీవి