టిక్ టాక్ ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారాలు

టిక్ టాక్ ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారాలు
x
Highlights

ప్రస్తుత కాలంలో యువత మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్ వున్న ప్రతి ఒక్కరూ ఎక్కువగా వాడుతున్న యాప్ టిక్ టాక్. ఇప్పుడు ఈ యాప్ వాడకం పై ప్రభుత్వం కూడా మొగ్గుచూపుతుంది. ఈ యాప్ ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారాలు చేసుకోవడానికి వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సందర్భంగా టిక్‌ టాక్‌ ఇండియా–తెలంగాణ ఐటీశాఖ, డిజిటల్‌ మీడియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. హోటల్‌ హరిత ప్లాజాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిక్‌ టాక్‌ ఇండియా పాలసీ డైరెక్టర్‌ నితిన్‌ సాలూజా, యువరాజ్‌, ఐటీ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ మాట్లాడుతూ ఈ యాప్ ని ప్రభుత్వ సంక్షేమ కార్యమాలకు వినియోగించుకోవొచ్చని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఎం పీఆర్వో రమేశ్‌ హజారి, రాచకొండ కమిషనర్‌ పీఆర్వో దయాకర్, సైబరాబాద్‌ కమిషనర్‌ పీఆర్వో కిరణ్‌ కుమార్, డీజీపీ సీపీఆర్వో హర్ష భార్గవి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories