వారాల వడ్డీ..ఆలస్యమైతే చుక్కలే.. వడ్డీ రాబంధుల అరాచకం ఆగేదెప్పుడు..?

వారాల వడ్డీ..ఆలస్యమైతే చుక్కలే.. వడ్డీ రాబంధుల అరాచకం ఆగేదెప్పుడు..?
x
వారాల వడ్డీ..ఆలస్యమైతే చుక్కలే.. వడ్డీ రాబంధుల అరాచకం ఆగేదెప్పుడు..?
Highlights

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. సినీఫక్కీలో ఇళ్లకొచ్చి వేధింపులకు గురిచేస్తున్నారు. అప్పు తీసుకుని గ్రహపాటుగా...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. సినీఫక్కీలో ఇళ్లకొచ్చి వేధింపులకు గురిచేస్తున్నారు. అప్పు తీసుకుని గ్రహపాటుగా చెల్లించటంలో ఆలస్యమైతే ఇక చుక్కలు చూపిస్తున్నారు. వడ్డీ మాఫియా ఉచ్చులో చిక్కితే చాలు జలగల్లా రక్తాన్ని పీల్చుతున్నారు. వారాల వడ్డీతో నిలువు దోపిడి చేస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. వడ్డీ రాబంధుల ఉచ్చులో చిక్కుకుని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు విలవిలలాడుతున్నాయి.

కాల్‌మనీ తరహాలో జిల్లాలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్కడిక్కడ వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. కొందరు వ్యాపారులు అడ్డగోలు వడ్డీతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. మరికొందరు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో అమాయకులను రెట్టింపు వడ్డీలతో దోపిడీ చేస్తున్నారు. దీంతో అసలు కన్నా వడ్డీ ఎక్కువై అప్పు కట్టలేని పరిస్ధితుల్లో ఇళ్లు, స్థలాలు, ఇతర ఆస్తులను దర్జాగా వడ్డీ వ్యాపారులు జప్తు చేసుకుంటున్నారు. దీంతో అప్పు తీసుకున్న ప్రజలు అల్లాడిపోతున్నారు.

వడ్డీ వ్యాపారులు రెండు వేల నుంచి రెండు లక్షల వరకు అప్పు ఇస్తున్నారు. శ్రీబాలాజీ, సాయిబాబా, వీకే, గజానన, వెంకటేశ్వర, సాయి వంటి సంస్ధల పేరుతో వ్యాపారులు వడ్డీలు ఇస్తున్నారు. ఏజెన్సీలు, పల్లెలు, చిరువ్యాపారులు వడ్డీ మాఫియా చేతిలో కుదేలవుతున్నారు. తీసుకున్న అప్పును వారాల వారీగా వసూలు చేస్తున్నారు వడ్డీ బకాసురులు. పదివేల నుంచి రెండు లక్షల వరకు డబ్బులు తీసుకున్నా ప్రతి వారం అసలు, వడ్డీ చెల్లించాల్సిందేనని బాధితులు వాపోతున్నారు. డబ్బులు కట్టలేకపోతే నానా బీభత్సం సృష్టించడంతో పాటు బండబూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వడ్డీ వ్యాపారం పేరుతో కొందరు చేస్తున్న దందాతో దివాలా తీస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకుంటే జలగల్లా తమ నెత్తూరు తాగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఆంధ్రా, తమిళనాడుకు చెందిన వడ్డీ వ్యాపారులు అమాయక ప్రజలు, చిరువ్యాపారులను టార్గెట్‌ చేసుకుని దందా చేస్తున్నారని వాపోయారు. అప్పులు తీసుకున్న తాము వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్నామని ఇప్పటికైనా వారి ఆగడాలకు కళ్లెం వేయాలని చిరువ్యాపారులు, సామాన్య ప్రజలు వేడుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories