భారీగా పెరిగిన బస్‌ చార్జీలు.. పెరిగిన ఛార్జీల వివరాలు..

భారీగా పెరిగిన బస్‌ చార్జీలు.. పెరిగిన ఛార్జీల వివరాలు..
x
Highlights

తెలంగాణలో ఈ అర్ధరాత్రి నుంచి పెరిగిన బస్‌ చార్జీలు అమలు కానున్నాయి. ఛార్జీల పెంపునకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ అన్ని...

తెలంగాణలో ఈ అర్ధరాత్రి నుంచి పెరిగిన బస్‌ చార్జీలు అమలు కానున్నాయి. ఛార్జీల పెంపునకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ అన్ని బస్సు సర్వీసుల్లో కిలోమీటరుకు రూ. 20 పైసల చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. ఈ పెరిగిన ఛార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

బస్సులను బట్టి పెరగనున్న ఆయా చార్జీల వివరాలు..

పల్లె వెలుగు కనీస చార్జీ రూ.5 నుంచి రూ.10కు పెంపు

సెమీ ఎక్స్‌ప్రెస్‌ కనీస చార్జీ రూ.10గా నిర్దారించిన అధికారులు

ఎక్స్‌ప్రెస్‌ కనీస చార్జీ రూ.10 నుంచి రూ.15కి పెంపు

డీలక్స్‌ కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కి పెంపు

సూపర్‌ లగ్జరీ కనీస చార్జీ రూ.25

రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస చార్జీ రూ.35

గరుడ ఏసీ లో కనీస చార్జీ రూ.35

గరుడ ప్లస్ ఏసీలో కనీస చార్జీ రూ.35

వెన్నెల ఏసీ స్లీపర్ లో కనీస చార్జీ రూ.75

Show Full Article
Print Article
More On
Next Story
More Stories