57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్‌ అమలు...

57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్‌ అమలు...
x
Highlights

రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో 60 ఏండ్లు నిండిన వారికి ప్రభుత్వం పెన్షన్ అందిస్తున్న విషయం తెసిందే. కాగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 57 ఏండ్లు నిండిన వారికి ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో 60 ఏండ్లు నిండిన వారికి ప్రభుత్వం పెన్షన్ అందిస్తున్న విషయం తెసిందే. కాగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 57 ఏండ్లు నిండిన వారికి ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెన్షన్‌ వయస్సు 57 ఏండ్లకు తగ్గించడంతో రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల లబ్దిదారుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 39,41,976 నుంచి మరింత పెరగనుందని ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో అర్హులకు ప్రభుత్వం రూ. 1000 పెన్షన్‌ ఇచ్చుకున్నామని తెలిపారు.

కానీ ఆ పెన్షన్ శాతాన్ని ప్రతి ఆర్ధికసంవత్సరంలో పెంచుకంటూ వచ్చిందని తెలిపారు. ఇందులో భాగంగానే వికలాంగుల పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3,016 కు పెంచుకున్నామని తెలిపారు. దాంతో పాటుగానే వృద్ధులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, వితంతువులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధి బాధితులు, గీతకార్మికులకు రూ.2,016 పెన్షన్‌ ఇచ్చుకుంటున్నామని తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పెన్షన్లకు రూ.9,402 కోట్లు కేటాయించామని. ఈ ఏడాది బడ్జెట్‌లో 11,758 కోట్లు ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు. దేశంలోనే సంక్షేమరంగానికి అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 40 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు పేదలకు జీవన భద్రతను, భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తున్నాయని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories