Top
logo

బీటెక్‌ విద్యార్థి జీవన్‌రెడ్డి మిస్సింగ్‌ కేసులో వీడిన మిస్టరీ

బీటెక్‌ విద్యార్థి జీవన్‌రెడ్డి మిస్సింగ్‌ కేసులో వీడిన మిస్టరీబీటెక్‌ విద్యార్థి జీవన్‌రెడ్డి మిస్సింగ్‌ కేసులో వీడిన మిస్టరీ
Highlights

బీటెక్‌ థర్డ్ ఇయర్‌ విద్యార్థి జీవన్‌రెడ్డి మిస్సింగ్‌ మిస్టరీ వీడింది. 15 రోజుల క్రితం మేడ్చల్‌లోని...

బీటెక్‌ థర్డ్ ఇయర్‌ విద్యార్థి జీవన్‌రెడ్డి మిస్సింగ్‌ మిస్టరీ వీడింది. 15 రోజుల క్రితం మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజ్‌ నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు జీవన్‌రెడ్డి. దీంతో హాస్టల్‌ యాజమాన్యం జీవన్‌రెడ్డి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే జీవన్‌రెడ్డి ఉంటున్న హాస్టల్‌ రూమ్‌లో రక్తపు మరకలు ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. విద్యార్థి తండ్రి ప్రభాకర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు 15 రోజులుగా అతని కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు జీవన్‌ రెడ్డి గోవాలో ఉన్నట్లు గుర్తించారు. జల్సాల కోసం గోవాకు వెళ్లినట్లు గుర్తించారు.



Web Titlebtech student jeevan reddy mystery case revealed
Next Story


లైవ్ టీవి