ప్రేమించానన్నాడు... రూ.5 లక్షలు కాజేసాడు..

ప్రేమించానన్నాడు... రూ.5 లక్షలు కాజేసాడు..
x
Highlights

పదో తరగతి చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి దగ్గర నుంచి అక్షరాల రూ.5 లక్షలు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న యువకుడిని సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

పదో తరగతి చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి దగ్గర నుంచి అక్షరాల రూ.5 లక్షలు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న యువకుడిని సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కొరివిని గూడెం గ్రామానికి చెందిన సుమంత్‌రెడ్డి (21) చైతన్యపురిలో ఉంటున్నాడు. అక్కడే ఓ ప్రయివేటు పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో కొన్ని రోజులుగా చనువుగా ఉంటూ ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. అది నమ్మిన ఆ విద్యార్థిని సుమంత్‌రెడ్డి ఎప్పుడు డబ్బులు కావాలన్నా ఇంట్లో తన తండ్రి రిజిస్ర్టేషన్‌ కోసం దాచిపెట్టిన డబ్బులను ఇచ్చేది.

తను ఎంటెక్ చేస్తున్నానని ఫీజుకు డబ్బులు కావాలని, బైక్ కొనాలని, అవసరాలున్నాయని పదే పదే డబ్బులను అడిగేవాడు. అది నమ్మి ఆ విద్యార్థిని పూర్తిగా రూ.5 లక్షల వరకు నగదును ఇచ్చేసింది. డబ్బులు తీసుకున్న సుమంత్‌రెడ్డి ఎక్కడ విషయం భయటపడుతుందో అన్న భయంతో మూడు నెలలుగా పాఠశాలకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అదే సమయంలో రిజిస్ర్టేషన్‌ ఉండడంతో విద్యార్థిని తండ్రి ఇంట్లో డబ్బులు చూసుకున్నాడు. దాంట్లో ఐదు లక్షల నగదు తక్కువగా రావడంతో కుటుంబ సభ్యులందర్ని ప్రశ్నించాడు. దీంతో విషయాన్ని బాలిక తన తండ్రికి చెప్పేసింది. గత నెలలో విషయం తెలియగానే 26న సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సుమంత్‌రెడ్డిని గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories