Top
logo

నేటి నుంచి తెలంగాణ ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు

నేటి నుంచి తెలంగాణ ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు
Highlights

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు ఇక నుండి ఆన్‌లైన్ కానున్నాయి. దేవాలయాల్లో ముందుగా వరంగల్‌లోని భద్రకాళి, భద్రాచలం, పెద్దమ్మ తల్లి దేవాలయాలకు సంబంధించి ఆన్‌లైన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు ఇక నుండి ఆన్‌లైన్ కానున్నాయి. దేవాలయాల్లో ముందుగా వరంగల్‌లోని భద్రకాళి, భద్రాచలం, పెద్దమ్మ తల్లి దేవాలయాలకు సంబంధించి ఆన్‌లైన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సేవలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఇక, ఆయా ఆలయాల్లో ఆర్జిత సేవలు, గదుల్ని ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవచ్చు. దీనిలో భాగంగా పూజలు, ప్రత్యేక సేవలు, ప్రసాదం నిత్య కళ్యాణం, హోమాల సేవలను ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవచ్చు. టీ యాప్ ఫోలియో ద్వారా కూడా ఈ బుక్ చేసుకోవచ్చు.


లైవ్ టీవి


Share it
Top