కమలంలో శోభ మళ్లీ వికసించే ప్రయత్నమా?

కమలంలో శోభ మళ్లీ వికసించే ప్రయత్నమా?
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కాంట్రావర్సియల్ కామెంట్స్‌కు కేరాఫ్‌ అయ్యారు. కాని ఎన్నికల్లో ఓటమి...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కాంట్రావర్సియల్ కామెంట్స్‌కు కేరాఫ్‌ అయ్యారు. కాని ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన ఆమె, ఇప్పుడు మళ్లీ యాక్టివ్‌గా మారుతున్నారు. మరి ఇప్పుడు ఆమె వ్యూహమేంటి గులాబీ కాదని కమలంలో వికసించాలన్న ఆమె మలి ప్రయత్నం ఫలిస్తుందా?

బొడిగే శోభ టీఆర్ఎస్‌ నుంచి గత అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే 2014లో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన నాటి నుంచి తనదైన శైలిలో పని చేస్తూ నియోజకవర్గంలో వివాదాలను, ఇటు కొందరి అభిమానాన్నీ కూడా సంపాదించారు. చొప్పదండి నియోజకవర్గంలో బొడిగె శోభ ఫైర్ బ్రాండ్‌గా నిలిచారు. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులను సైతం పక్కనపెట్టి, తనదైన శైలిలో ముందుకు వెళుతూ ఎక్కువమందికి శత్రువుగా మారిపోయారు. దీంతో అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ నిరాకరించింది టిఆర్ఎస్.

టిఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల టైంలో బిజెపిలో చేరారు. కమలం బీ ఫామ్‌తో చొప్పదండి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు శోభ. అయితే అక్కడ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రవి శంకర్ గెలిచారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పెద్దగా పర్యటించకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు బొడిగె శోభ. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి తరఫున ఎక్కడా స్వయంగా ప్రచారంలో పాల్గొనలేదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే, చొప్పదండి సెగ్మెంట్లో ఎన్నికల సమయంలో బొడిగె శోభ పెద్దగా కనిపించకపోవడంతో బిజెపికి సైతం ఆమె దూరంగా ఉంటున్నారా అన్న సందేహాలు ఉత్పన్నమయ్యాయి. అయితే కరీంనగర్ పార్లమెంట్ బిజెపి కైవసం చేసుకోవడంతో, ఇప్పుడు బొడిగె శోభ మళ్ళీ పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు రోజుల క్రితం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కరీంనగర్ నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా బయల్దేరారు. ఆ పాదయాత్రలో నియోజకవర్గానికి రాగానే సంజయ్‌తో కలిసి పాల్గొన్నారు శోభ.

తెలంగాణలో బిజెపి బలపడుతుందన్న సంకేతాలతో శోభ సైతం పాలిటిక్స్‌లో మళ్ళీ క్రియాశీలకం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్దమవుతున్నట్టు కనపడుతోంది. అయితే బొడిగె శోభ తీరుకు, బీజేపీ తీరుకు సెట్‌ అవుతుందా అన్నదే ఇప్పుడు ఆమె అభిమానుల్లో సైతం చర్చను లేవనెత్తుతోంది.

టిఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్‌గా ఉండేవారు శోభ. టిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీలోని కొందరు నాయకులపై పెద్దఎత్తున ఆరోపణలు సైతం చేశారు. మరి ఇప్పుడు బిజెపిలో బొడిగె శోభ ఎలాంటి పాత్ర పోషిస్తారు గతంలో లాగే సీరియస్ పాలిటిక్స్ చేస్తారా లేదంటే తీరు మార్చుకుని పాలిటిక్స్ చేస్తారా అంటూ చొప్పదండి నియోజకవర్గంలో ఓ చర్చ జరుగుతోంది. గతంలో వివాదాల్లో మనిషిగా మారిన బొడిగె శోభ, ఇప్పుడు బిజెపి పార్టీలో వివాదాలకు తావు లేకుండా ఉంటారా, లేదంటే తనదైన శైలిలోనే వెళతారా అని అంతా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. తనకు టిఆర్ఎస్‌లో టికెట్ రానివ్వకుండా కొందరు అడ్డుకున్నారని, గతంలోనే కొందరిపై ఆరోపణలు చేశారు శోభ. మరి వారిపై సొంత నియోజకవర్గంలో బొడిగె శోభ పొలిటికల్ రివెంజ్ తీర్చుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. చూడాలి, యాక్టివ్‌ రోల్ పోషించేందుకు సిద్దమైన బొడిగే శోభకు, బీజేపీ కూడా ఎలాంటి పాత్ర ఇస్తుందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories