మున్సిపల్ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ పునరాలోచనలో పడిందా?

మున్సిపల్ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ పునరాలోచనలో పడిందా?
x
Highlights

నిన్నా మొన్నటి వరకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన గులాబీ పార్టీ నేతలు, ఇప్పట్లో ఎలక్షన్ రావొద్దు బాబోయి అనుకుంటున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో...

నిన్నా మొన్నటి వరకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన గులాబీ పార్టీ నేతలు, ఇప్పట్లో ఎలక్షన్ రావొద్దు బాబోయి అనుకుంటున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్న నేతలు ఇప్పుడు ఆలోచలనలో పడ్డారా? తెలంగాణలో తమకు తిరుగులేదని అనుకుంటున్న ఆ పార్టీ నేతలు ప్రత్యర్థి పార్టీని చూసి భయపడుతున్నారా? మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడితేనే మంచిదని టీఆర్ఎస్ అనుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు అధికార పార్టీ నేతలు. ఇంతకీ ఆ భయమేంటి?

మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సారు... కారు... పదహారు అంటూ పార్లమెంట్ స్థానాలు దక్కించుకునే నినాదంతో గులాబీ పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. పదహారు స్థానాల్లో పదహారు తామే గెలుస్తామంటూ భరోసాగా ఉన్న తర్వాత పరిస్థితి తారుమారైంది. తెలంగాణలోని యూత్, ఉద్యోగులు అందరూ బీజేపీ వైపు మొగ్గు చూపారు. దీంతో అసలు ఒక్క స్థానం కూడా కష్టమనుకున్న స్థితిలో కమలం నాలుగు స్థానాలను ఖాతాలో వేసుకుంది. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీ కొట్టిన దెబ్బకి గులాబీ అధిష్టానం మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ దెబ్బను మున్సిపల్ ఎన్నికలలో బీజేపీపై కొట్టాలని, ఒకరకంగా రివెంజ్ తీసుకోవాలన్న కసితో గులాబీ పార్టీ పుర పోరుకు సిద్ధమైంది.

మున్సిపల్ ఎన్నికలలో బీజేపీకి గుణపాఠం చెప్పాలని గులాబీ పార్టీ ఆతృతగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచి ఎగిరి ఎగిరి పడిన కమలం నేతల నోర్లు మూయించాలని పార్టీ అధినేత ఆశించారు. త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరుకుంది. ఆ ఎన్నికలలో లబ్ది చేకూరాలనే ఉద్దేశంతో మున్సిపల్ చట్టాన్ని కూడా తీసుకొని వచ్చింది. ఆగస్టులోనే ఎన్నికలు నిర్వహించాలని భావించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రిజర్వేషన్లు, వార్డుల విభజన జరిపింది. కానీ కొన్ని చోట్ల రిజర్వేషన్లు సరిగ్గా చేయలేదని కొందరు నేతలు హైకోర్ట్‌ని ఆశ్రయించడంతో కోర్టు స్టేలు ఇచ్చింది. దీంతో టీఆర్ఎస్ నేతలు కొంత గందరగోళానికి గురయ్యారు.

తర్వాతైనా తమదే విజయమనుకుంటున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎన్నికలు అంటే భయపడుతున్నారు. సింహభాగం స్థానాలను గెలుస్తామనుకున్న గులాబీదళం కమలం పార్టీ నేతలను చూసి కంగారు పడుతుందిప్పుడు. కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ని రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని గులాబీ నేతలు భావిస్తున్నారు. దేశమంతా మోడీ నాయకత్వాన్ని కొనియాడుతుందనే చర్చ అధికార పార్టీలో జరుగుతోంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమలానికి ఓటు వేసిన యువత, ఉద్యోగులు స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్‌కే ఓటు వేస్తారని గులాబీ బాస్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తే అర్బన్ ఓటర్లు అందరూ బీజేపీకే ఓట్లు వేస్తారేమోనన్న గుబులు గులాబీదళంలో కనిపిస్తుంది. ఈనెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే కమలం మరోసారి తమను దెబ్బ కొడుతోందని గులాబీనేతలే గుట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి మోడీనో, అమిత్ షానో తెలంగాణలో అడుగుపెడితే ఆ పార్టీ బలం పెరుగుతోందని గులాబీ అధిష్టానం మున్సిపల్ ఎన్నికల విషయంలో పునరాలోచనలో పడిందన్న చర్చ జోరుగా సాగుతోంది.

పార్లమెంట్ ఎన్నికల్లో తమను దెబ్బకొట్టిన బీజేపీని మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బకొట్టాలని గులాబీ బాస్ భావించారు. ప్రతిపక్షాలకు చాన్స్‌ ఇవ్వొద్దన్న ఉద్దేశంతో మున్సిపల్ చట్టాన్ని కూడా తీసుకొని వచ్చారు. ఇక ఎన్నికల షెడ్యూల్ రావడమే లేటు కాంగ్రెస్, బీజేపీలను కోలుకోలేని దెబ్బ కొట్టాలనే అతురతతో గులాబీ నేతలు ఉన్నారు. కానీ కాశ్మీర్ సమస్య పరిష్కరం కోసం 370 ఆర్టికల్ రద్దు చేయడంతో కమలం గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందని, ఇప్పుడు ఎన్నికలు రాకపోతేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories