Adilabadలో రిగ్గింగ్ లొల్లి.. టీఆర్ఎస్ , బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

Adilabadలో రిగ్గింగ్ లొల్లి.. టీఆర్ఎస్ , బీజేపీ నేతల మధ్య వాగ్వాదం
x
ఆదిలాబాద్‌లో రిగ్గింగ్ లొల్లి.. టీఆర్ఎస్ , బీజేపీ నేతల మధ్య వాగ్వాదం
Highlights

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండలం కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. బోథ్ జూనియర్ కళాశాలలోని సహకార ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద...

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండలం కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. బోథ్ జూనియర్ కళాశాలలోని సహకార ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు. మూడవ బూత్ వద్ద బీజేపీ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని బయటికి పంపించారు.

తెలంగాణలో సహకార సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 905 పీఏసీఎస్ ల పరిధిలోని 11 వేల 765 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 157 సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 748 సంఘాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories