బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం
x
Highlights

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ శాసనసభ్యుడు బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. బంజరాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో ఆయన చికిత్స...

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ శాసనసభ్యుడు బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. బంజరాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి శనివారం సాయంత్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. బద్దం బాల్‌రెడ్డిని ఆస్పత్రిలో పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విలేకరులతో మాట్లాడారు. ' ఈ నెల 10 తేదీన బద్దం బాల్‌రెడ్డి కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు లివర్‌లో ప్రాబ్లమ్ ఉందని వైద్యులు చెప్పారు. ఆయన పరిస్థితి ఇంకా విషమించింది. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories