Top
logo

బీజేపీ గెలుపొందితే.. నిజామాబాద్‌ పేరు మార్చేస్తాం!

బీజేపీ గెలుపొందితే.. నిజామాబాద్‌ పేరు మార్చేస్తాం!బీజేపీ గెలుపొందితే.. నిజామాబాద్‌ పేరు మార్చేస్తాం!
Highlights

భైంసాలో ఓ వర్గంపై దాడులకు నిరసనగా రేపు 24 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్...

భైంసాలో ఓ వర్గంపై దాడులకు నిరసనగా రేపు 24 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా దీక్ష చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ మేయర్ పీఠం మజ్లిస్ కు కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టోను ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం విడుదల చేశారు.

నిజామాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీని గెలిపించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రజలను కోరారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో గెలుపొంది.. మేయర్‌ పదవిని చేపడితే ఏం చేస్తామనే విషయాలను ఆయన వివరించారు. మొదట నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అదేవిధంగా నిజామాబాద్‌ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తామని, పట్టణంలో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేస్తామని, కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపింది. బీజేపీ గెలుపొందితే నిజామాబాద్‌ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చింది.

Web TitleBJP releases manifesto for nizamabad corporation elections
Next Story


లైవ్ టీవి