Top
logo

బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎంపీ ధర్మపురి

బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎంపీ ధర్మపురి
X
Highlights

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో...

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ముదాంగల్లీ, ఇందిరా చౌక్‌ ప్రాంతాల్లో ఏర్పాటు బీజేపీ సభ్యత్వ నమోదు చేపట్టారు. రైతాంగమంతా బీజేపీలో చేరుతుందని, పసుపు రైతుల ఆశీర్వాదం ఎప్పటికీ తనపై ఉంటుందని తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో తెలంగాణపై బీజేపీ స్పెషల్ పోకస్ పెడుతుందని అన్నారు. నిన్న జరిగిన అమిత్ షా పర్యటనలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని, 70 ఏళ్ల అవినీతిని తొలగించడానికి నిఖార్సయిన ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసుకోవాలన్నారు ఎంపీ అరవింద్. కాగా పసుపు రైతుల ఇబ్బందులు తీర్చే రోజు దగ్గరకు వచ్చిందని, ఆ సమస్య తీర్చిన రోజున టిఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ నెత్తిపై గుడ్డ వేసుకొని కూర్చోవలసి వస్తుందని ధర్మపురి ఎద్దేవా చేశారు.

Next Story