భూపాలపల్లిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచారం

భూపాలపల్లిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచారం
x
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
Highlights

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజాసింగ్.....

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజాసింగ్.. టీఆర్ఎస్ వంటి చిల్లర పార్టీలకు ప్రజలు ఓట్లు వేయమని చెబుతున్నారన అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు వచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పిన కేసీఆర్.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో 150 కార్పోరేట్ స్థానాలకు 45 స్థానాలు ఎంఐఎం పార్టీ కార్పోరేటర్లు అంతా మా బామ్మర్దులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వచ్చేనెల జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై సీఎస్‌ టెలిక్ఫారెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్‌ ద్వారా నిర్మించే రోడ్ల, కల్వర్టుల నిర్మాణాన్ని జనవరి 25లోపు పూర్తిచేయాలని, తర రోడ్లు, ప్యాచ్‌వర్క్‌ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. రోడ్ల వెంట మూడు భాషలతో సైన్‌బోర్డుల ఏర్పాటును వెంటనే ప్రారంభించాలన్నారు. పార్కింగ్‌లాట్ల వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేసి సక్రమంగా వాహనాలు పార్కింగ్‌ చేసేలా చూడాలన్నారు. శానిటేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

జిల్లా యంత్రాంగం అక్కడే ఉండి పనులను సమన్వయంతో పూర్తి చేయాలని సీఎస్‌ ఆదేశించారు. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ను సక్రమపద్దతిలో ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అన్నారు. టాయిలెట్స్‌, ట్యాప్‌ల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. కలెక్టర్‌, ఎస్‌పి, స్పెషల్‌ ఆఫీసర్‌, ఐటిడిఏ, పీవో , సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు.

బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేసి రద్దీ లేకుండా క్రమబద్దీకరించాలని అన్నారు. త్వరలోనే పనుల పరిశీలనకు పర్యటిస్తామని తెలిపారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వాహనాలు బ్రేక్‌డౌన్‌ అయినప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి రెండు కి.మీ. కు ఒక్క చోట పీఏ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి బెన్‌హర్‌మహేశ్‌దత్‌ ఎక్కా, అడిషనల్‌ డీజీపీ జితేందర్‌, ఐజి నాగిరెడ్డి, ములుగుజిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జాతర స్పెషలాఫీసర్‌ విపిగౌతం తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories