టీఆర్ఎస్ మా మొదటి టార్గెట్ : మురళీధర్‌రావు

టీఆర్ఎస్ మా మొదటి టార్గెట్ : మురళీధర్‌రావు
x
Highlights

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తెలంగాణలో బలపడటమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. తమ టార్గెట్‌...

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తెలంగాణలో బలపడటమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. తమ టార్గెట్‌ టీఆర్ఎస్ అని అన్నారు. ఏపీలో అయితే కులం కార్డు పనిచేస్తుంది కాని తెలంగాణలో మాత్రం పనిచేయదని అన్నారు. ప్రస్తుతం బీజేపీ బలపడాలంటే తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ అవకాశాలున్నాయని ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మురళీధర్‌రావు అన్నారు.

తెలంగాణలో బీజేపీకి రెండు ఛాలెంజులున్నాయని ముందుగా ప్రజలకు పార్టీపై నమ్మకం కలిగించాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 29 శాతం ఓట్లు ఉన్నాయని వాటిని బీజేపీకి మళ్లించాలని అన్నారు. అదే తమ రెండో లక్ష్యం అని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో మైనార్టీ ఓటుబ్యాంకు ఉండేదని అదిప్పుడు టీఆర్ఎస్, ఎంఐఎంకు మళ్లిందని అన్నారు. ఇక గవర్నర్ల రాజకీయంపై కూడా మురళీధర్‌రావు స్పందించారు. గవర్నర్‌ పదవిని రాజకీయం కోసం వాడుకోబమని అలావాడుకుంటే తమకే నష్టం అని అన్నారు.

కేసీఆర్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయన్న వార్తల్లో నిజం లేదన్నారు మురళీధర్‌రావు. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చినా వదిలిపెట్టానని 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. అందుకే జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉందని వివరించారు. రాంమాధవ్‌తో తనకు ఎలాంటి పోటీ లేదని స్పష్టం చేశారు. కులానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి తాను కాదని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories