పీఓకేను దేశంలో విలీనం చేస్తాం: కృష్ణసాగర్‌ రావు

పీఓకేను దేశంలో విలీనం చేస్తాం: కృష్ణసాగర్‌ రావు
x
Highlights

మోడీ సర్కారు తదుపరి లక్ష్యం పీఓకే స్వాధీనం అని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు అన్నారు. హెచ్‌ఎంటీవీ సీఈవో శ్రీనితో స్పెషల్‌ డిబేట్‌లో...

మోడీ సర్కారు తదుపరి లక్ష్యం పీఓకే స్వాధీనం అని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు అన్నారు. హెచ్‌ఎంటీవీ సీఈవో శ్రీనితో స్పెషల్‌ డిబేట్‌లో పాల్గొన్న ఆయన ఇటీవలి పరిణామాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ స్వాధీనం అన్నది దౌత్య పరంగానా లేక సైనిక చర్య పరంగానా అన్నది కాలం నిర్ణయిస్తుందని అన్నారు.

దేశం దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపించామని కృష్ణసాగర్‌ రావు అన్నారు. 72 ఏళ్ల నుంచి కశ్మీర్‌పై మనదేశం ఏకంగా 45 లక్షల కోట్లు ఖర్చు చేసిందని లెక్కలు విప్పారు. అంతమొత్తంలో మనదేశంలో ఇతర రంగాలపై ఖర్చు పెడితే అభివృద్ధిలో అమెరికాను మించిపోయే వాళ్లమని కృష్ణసాగర్‌ రావు చెప్పారు.

ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రధాన ప్రతిపక్షం భిన్నస్వరాలను వినిపిస్తుందని ఎద్దేవా చేశారు కృష్ణ సాగర్‌ రావు. దేశ ప్రయోజనాలు, కశ్మీరీ ప్రయోజనాల గురించి కాకుండా పాక్‌, చైనా వాయిస్‌ను వినిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జాతీయ పార్టీ అయి ఉండి ఇతర దేశాల ప్రయోజనాలపై వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories