కాసేపట్లో హైదరాబాద్‌కు జేపీ నడ్డా

కాసేపట్లో హైదరాబాద్‌కు జేపీ నడ్డా
x
Highlights

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.. కాసేపట్లో తెలంగాణకు రానున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తొలిసారి హదరాబాద్ కు రానున్న నడ్డాకు.. ఘనంగా...

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.. కాసేపట్లో తెలంగాణకు రానున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తొలిసారి హదరాబాద్ కు రానున్న నడ్డాకు.. ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత .. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

నడ్డా సమక్షంలో బీజేపీలోకి భారీ చేరికలుంటాయని.. చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచే పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలకు చెందిన ఇంచార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories