వినూత్న రీతిలో కేసీఆర్ కు శుభాకాంక్షలు

వినూత్న రీతిలో కేసీఆర్ కు శుభాకాంక్షలు
x
Highlights

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు రేపు జరగనున్నారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో కేసీఆర్ అభిమానులు తమకు నచ్చిన రీతిలో అభిమానాన్ని చాటి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు రేపు జరగనున్నారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో కేసీఆర్ అభిమానులు తమకు నచ్చిన రీతిలో అభిమానాన్ని చాటి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గజ్వేల్ నియోజక వర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు తమ అభిమాన నేతకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. శనివారం పట్టణంలోని మైదానంలో 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2.600 మంది తమ అభిమాన నేత కేసీఆర్‌ ఆకారంలో నిలబడ్డారు. ఎంతో అద్భుతమైన ఈ దృశ్యాన్ని 120 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్‌ కెమెరాతో బంధించారు. ఈ దృష్యాన్ని చూడడానికి ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

ఇకపోతే రేపు కేసీఆర్ పుట్టిన రోజు కావడంతో రెండు రోజుల ముందునుంచే సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజక వర్గంలో ఆయన పుట్టినరోజు వేడులకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను మొదలు పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆయన జన్మదిన వేడుకల సందడి నెలకొంది. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజక వర్గంలో మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories