రేపటి నుంచి హైదరాబాద్ లో బయో ఏషియా సదస్సు: కేటీఆర్

రేపటి నుంచి హైదరాబాద్ లో బయో ఏషియా సదస్సు: కేటీఆర్
x
Highlights

హైదరాబాద్ నగరంలో ఈ నెల 17వ తేది నుంచి లైఫ్‌సైన్సెస్‌ రంగంలో కీలకమైన బయో ఏషియా సదస్సు ప్రారంభంకానున్నది.

హైదరాబాద్ నగరంలో ఈ నెల 17వ తేది నుంచి లైఫ్‌సైన్సెస్‌ రంగంలో కీలకమైన బయో ఏషియా సదస్సు ప్రారంభంకానున్నది. ముఖ్యంగా ఈ సదస్సులో లైఫ్‌సైన్సెస్‌ టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ రంగాల్లో మహిళలు సాధించిన ప్రగతిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం వారు చేసిన సేవలను గుర్తించి వారికి అవార్డులు ప్రధానం చేయనున్నారు. అనంతరం ఈ సదస్సులో దేశంలో లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, మెడికల్‌ డివైజెస్‌ అండ్‌ డిజిటల్‌ హెల్త్‌కేర్‌ రంగాల అభివృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు, లాంటి పలు కీలక అంశాలపై ఈసదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. ఇక పోతే ఈ సదస్సులో ఈ ఏడాది స్విట్జర్లాండ్‌తోపాటు అసోం, కేరళ, ఒడిశా, గుజరాత్‌ రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సదస్సుకు 800 కంపెనీల ప్రతినిధులతోపాటు 75 స్టార్టప్‌ కంపెనీలు పాల్గొననున్నాయి, అంతే కాకుండా ఇండియా, స్విట్జర్లాండ్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్‌తదితర దేశాలకు చెందిన 175 ప్రదర్శనలు చేయనున్నాయి. ఇక పోతే వీటితో పాటు 37 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. హెచ్‌ఐసీసీలో మూడురోజులపాటు నిర్వహించనున్నారు. ఈ పెట్టుబడి దారులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుంది. ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ప్రపంచస్థాయి పరిశ్రమల్లో మౌలికవసతుల ప్రమాణాలను, పెట్టుబడులకు ఇక్కడున్న అవకాశాలను ప్రదర్శించేందుకు బయోఏషియా చక్కని అవకాశంగా ఉందన్నారు. ఈ సదస్సును 17 ఏండ్ల నుంచి నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా వందల కొద్దీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి స్థానిక కంపెనీలకు ప్రపంచ పెట్టుబడిదారులను పరిచయం చేసిందని స్పష్టం చేసారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జరిగే 17వ సదస్సుకు అనేకమంది ప్రముఖులతోపాటు కేంద్ర వాణిజ్య, రైల్వేశాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌, ప్రపంచస్థాయి కంపెనీల సీనియర్‌ ప్రతినిధులు, పరిశోధకులు ప్రత్యేక అతిథులుగా రానున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories