గ్రామ పొలిమేరల్లో మహిళా సర్పంచ్ కాపలా..

గ్రామ పొలిమేరల్లో మహిళా సర్పంచ్ కాపలా..
x
bheemunigudem sarpanch
Highlights

కరోనా వైరస్ కట్టడి చేయడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుం బిగించాయి.

కరోనా వైరస్ కట్టడి చేయడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుం బిగించాయి.ఎవరూ బయటికి వెల్లొద్దంటూ ఆదేశాలు జారీచేసాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం మాత్రమే బయటికి రావాలని, అది కూడా కుటుంబంలోని ఒక్క వ్యక్తి మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకుని యబటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం జనాలు వీధుల్లో తిరగకుండా చర్యలు చేపట్టింది. ఒక వేల అత్యవసర వస్తువుల కోసం బయటికి వెల్లిన ప్రజలు మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రాష్ట్రాల సరిహద్దులవద్ద కాపలా కాస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాలను సరిహద్దుల్లోనే నిలిపివేస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని గ్రామాల యువత, అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు.

కరోనాని కట్టడి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. తమ గ్రామాలకు బయటి గ్రామాల నుంచి ఎవరూ రాకుండా గ్రామ పొలిమేరల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. బయటి వారిని గ్రామాల్లో రానివ్వకుండా చూస్తున్నారు. తమ గ్రామాన్ని స్వీయ నిర్భంధం చేసుకున్న గ్రామస్తులు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పాలు అన్ని తమ గ్రామంలో లభించేవి అందరం వాడుకుంటాం అని తెలియచేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 100కు పైగా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఓ గ్రామసర్పంచ్ ఒక్కరే రంగంలోకి దిగి ప్రజలెవరిని బయటకు రాకుండా చేస్తున్నారు. భీమునిగూడెం గ్రామసర్పంచ్ మడకం పోతమ్మ అనే మహిళ తన గ్రామానికి తానే రక్షణగా ఉంటున్నారు. ఆమె గ్రామ పొలమేరల్లో చెతిలో కర్ర పట్టుకొని గ్రామానికి కాపలా కాస్తున్నారు. ఇతల గ్రామాల నుంచి ఎవరూ తమ గ్రామంలోకి రాకుండా, గ్రామం నుంచి ఎవరూ బయటకు పోకుండా కాపలాకాస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా బయటికి వెల్లాలనుకుంటే వారు ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకు మాత్రమే బయటికి పంపిస్తున్నారు. ఇక 9 గంటలు దాటిందంటే గ్రామం నుంచి ఎవరినీ కదలనివ్వకుండా హెచ్చరికలు జారీచేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఇదే విధంగా నిర్భంధం అమలు చేస్తే కరోనాను తరిమి కొట్టొచ్చని ఇతర గ్రామస్తులు అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories