సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త !

సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త !
x
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త !
Highlights

సంక్రాంతి పండగకు సొంత ఊళ్లకు వెళ్లుతున్నారా... ? ఇంటికి తాళం వేసి పక్కింటి వాళ్లకు కొద్దిగా తమ ఇంటిపైపు చూడమని చెప్పి వెళ్తున్నారా? అయితే తస్మాత్...

సంక్రాంతి పండగకు సొంత ఊళ్లకు వెళ్లుతున్నారా... ? ఇంటికి తాళం వేసి పక్కింటి వాళ్లకు కొద్దిగా తమ ఇంటిపైపు చూడమని చెప్పి వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు ఊళ్లకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల చేస్తున్నారు సంక్రాంతి దొంగలు. దీంతో పండగకు వేళ్లే వారు తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు పోలీసులు.

సంక్రాంతి పండగ అనగానే హైదరాబాద్ సగం వరకు ఖాళీ అవుతోంది. సంక్రాంతి ఫెస్టివల్ సెలెబ్రేషన్ చేసుకునేందుకు చాలా మంది సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్తుంటారు. సొంత ఊళ్లకు వెళ్లి పండగ చేసుకుంటుంటే సంక్రాంతి దొంగలు మాత్రం సిటీలో పండగా చేసుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు దొంగలకు పెద్ద పండగే. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గేట్ చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌ను సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా మార్చుతామంటున్న పోలీసులకు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు సవాళ్లు విసురుతున్నాయి. గత ఏడాది సంక్రాతి పండుగను టార్గెట్ గా చేసుకొని పదుల సంఖ్యలో ఇళ్ళలో చోరీలు చేశారు దీంతో ఈ ఏడాది ఎక్కడ చోరీలు , దోపిడీలు జరగకుండా పోలీసులు భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతి వరుస సెలవులను టార్గెట్ చేసిన దొంగల ముఠాలు ఇప్పటికే సిటీలో రెక్కీ నిర్వహించాయని, మొన్న దొరికిన కరుడుగట్టిన చెడ్డి గ్యాంగ్ అరెస్ట్ తరువాత పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ లు నిర్వయిస్తున్నారు.

పోలీస్ కేస్ స్టడీ ప్రకారం సిటీ శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని అంతర్రాష్ట్ర దొంగలు తమ దోపిడీలను కొనసాగిస్తున్నారు. వరుస సెలవులనే తమ దోపిడీలకు మంచి సమయంగా ఎంచుకుని కాలనీల్లో ఈ ముఠాలు రెక్కీ నిర్వహిస్తాయి. తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి పగలు రాత్రి అని తేడా లేకుండా చోరీలు చేయిస్తాయి ముఠాలు. అందుకోసం శివారు ప్రాంతాల్లోని కాలనీలు, పోలీస్ నిఘా తక్కువగా ఉండే ఏరియాల్లోని ఇళ్లనే తమకు చోరీలకు అనువైన ప్రాంతాలుగా సెలెక్ట్ చేసుకుంటాయి. అయితే, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదా పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చి వెళ్ళితే ఆ ఇంటి పై నిఘా ఉంచుతామంటున్నారు పోలీసులు.

మరోవైపు సంక్రాంతి పండుగ సమయాల్లో దొంగతనాల నియంత్రణకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ , రాచకొండ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో సంక్రాంతి సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై ఇప్పటికే అధ్యయనం చేసి ఆ ప్రాంతాలను మ్యాపింగ్ చేశారు. ఆ స్పాట్స్‌ల్లోనే ఎందుకు ఎక్కువ చోరీలు జరిగాయి ఏ కారణాలు దొంగలకు అనుకూలించాయనే అంశాలను పరిశిలీస్తున్నారు. ఆ ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసుకుని సరికొత్త యాక్షన్ ప్లాన్‌కు శ్రీకారం చుడుతున్నారు. అయితే, తాము ఎంత రెక్కీ నిర్వహించినా సొంత ఊళ్లకు వేళ్లే వారు తగిన విధంగా జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులంటున్నారు పోలీసులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories