పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం
x
Highlights

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మొన్నటి వరకు మూత పడిన సంక్షేమ వసతి గృహాలు ఎట్టకేలకు పదో తరగతి విద్యార్థుల కోసం తిరిగి తెరుచుకున్నాయి.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మొన్నటి వరకు మూత పడిన సంక్షేమ వసతి గృహాలు ఎట్టకేలకు పదో తరగతి విద్యార్థుల కోసం తిరిగి తెరుచుకున్నాయి.కరోనా విస్తరిస్తుండడంతో మార్చి లో వాయిదా పడిన పది పరీక్షలు ఈ నెల 8 వ తేదీన నిర్వహించ బోతున్న నేపథ్యంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం 66 హాస్టళ్లను సోమవారం పునః ప్రారంభించారు. కాగా విద్యార్థులను గురువారం నుంచి హాస్టళ్లలోకి అనుమతించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్షలు రాయడం క్షేమం కాదని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి హాస్టళ్లను తెరవాలని నిర్ణయించింది.

ఈ నేపధ్యంలో షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి పి.వెంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రత్యేక మెస్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బుధ, ఆది వారాల్లో చికెన్‌తో భోజనం, ప్రతిరోజు కోడిగుడ్డు, వారానికి ఆరు రోజులు ఆరటిపండు ఇస్తామని తెలిపారు. ఆల్పాహారంగా ప్రతిరోజూ ఇడ్లీ, లేదా కిచిడీ పెడతామన్నారు. ఉదయం, సాయంత్రం స్నాక్స్, కాఫీ, రాగి జావ అందిస్తామని, శనివారం స్వీట్‌ అందజేస్తామని వివరించారు.

అంతే కాకుండా ఎస్టీ హాస్టల్‌ విద్యార్థులకు భోజనంతో పాటు బూస్ట్‌ పాలు, బిస్కెట్లు అందించనున్నట్లు గిరి జన సంక్షేమ శాఖ పీఎంఓ రమణయ్య తెలిపారు. అదే విధంగా బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచుతున్నట్లు బీసీ సంక్షేమాధికారి సురేందర్‌ తెలిపారు.

ఇక హాస్టళ్లకు వెళ్లే విద్యార్థులు ప్రతి ఒక్కరు పరీక్షలు పూర్తయ్యేంతవరకు హాస్టళ్లలోనే నివాసం ఉండాలని తెలిపారు. హాస్టళ్లకు వచ్చే ముందే విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష రాసి తిరిగి వచ్చేటప్పుడు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే లోనికి అనుమతిస్తారు. ఒక్కో గదిలో నలు గురు విద్యార్థులు మాత్రమే ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. భౌతికదూరం పాటించేలా వార్డెన్లు అవగాహన కల్పిస్తారు. ప్రతిరోజూ శానిటైజ్, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. అందరికీ మాస్క్‌లు అందజేస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories