Top
logo

బాసర ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ రవిపై కేసు

బాసర ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ రవిపై కేసు
Highlights

బాసర ట్రిపుల్‌ ఐటీలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ రవిపై పోలీసులకు ఫిర్యాదు అందింది....

బాసర ట్రిపుల్‌ ఐటీలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ రవిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ట్రిపుల్ ఐటీ ఏఓ శ్రీహరి పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొంత మంది విద్యార్థినులపై కూడా వేధింపులకు పాల్పడ్డాడని.. అలాగే డబ్బులిస్తే మార్కులు వేస్తానని చాలా మంది స్టూడెంట్స్‌ దగ్గర వసూళ్లకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్ ఐటీ బాలికలపై ఓ కీచక్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. విద్యార్థినుల చరవాణిలకు అసభ్యకరంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ మెసేజులు పంపి, ఇంటికి వస్తే పాస్ మార్కులు వేస్తానని బలవంతం చేశాడు. చదువు నేర్చుకునే విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడు సభ్యసమాజం తలదించుకునేలా చేశారు.


లైవ్ టీవి


Share it
Top