ప్రభుత్వ వ్యతిరేకత వల్లే బీజేపీని గెలిపించారు : బండి సంజయ్

ప్రభుత్వ వ్యతిరేకత వల్లే బీజేపీని గెలిపించారు  : బండి సంజయ్
x
Highlights

జరిగిన తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కోట్లు ఖర్చు చేసిందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. డబ్బు, మద్యం వల్లే ఆ...

జరిగిన తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కోట్లు ఖర్చు చేసిందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. డబ్బు, మద్యం వల్లే ఆ పార్టీ విజయం సాధించిందని అయన ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో 60 డివిజన్లలో విజయం సాధిస్తామని చెప్పిన టీఆర్ఎస్ కేవలం 33 స్థానాలకే పరిమితం అయిందని, ఇక గతంలో బీజేపీ గెలుచుకున్న రెండు స్థానాలని కూడా కైవసం చేసుకుంటాం అని కొందరు నేతలు ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు మేము 13 స్థానాల్లో గెలిచమని కానీ మాకు గర్వం లేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వల్లే బీజేపీని ఇన్ని స్థానాల్లో ప్రజలు గెలిపించారని ఆయన పేర్కొన్నారు. పార్టీలకి అతీతంగా కరీంనగర్ కార్పొరేషన్ ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ లో మొత్తం 60 డివిజన్లలో టీఆర్ఎస్ కు చెందిన 34 మంది అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలుపొందారు. బీజేపీ 12, ఎంఐఎం 6 స్థానాల్లో విజయం సాధించాయి. ఏడు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. 2 డివిజన్లు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. 20, 37 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు తుల రాజేశ్వరి, చల్లా స్వరూపారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 31 మంది అభ్యర్థులు ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించారు.

టీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత సాధించినప్పటికి మేయర్ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు మొదలయ్యాయి. మాజీ మేయర్ రవీందర్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు మేయర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థే మేయర్ అవుతారని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్‌లో పార్లమెంట్ ఎన్నికల తరహాలో బీజేపీ హవా కొనసాగుతుందని భావించినా మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ చతికిలపడింది..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories