Top
logo

కేటీఆర్‌కు దత్తాత్రేయ లేఖ

కేటీఆర్‌కు దత్తాత్రేయ లేఖ
Highlights

తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జేపీ నడ్డాపై కామెంట్స్ చేస్తూ అతని పేరు ఇదివరకు తాను వినలేదన్న కేటీఆర్ వ్యాఖ్యల పై మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కేటీఆర్ కు లేఖ రాశారు.

తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జేపీ నడ్డాపై కామెంట్స్ చేస్తూ అతని పేరు ఇదివరకు తాను వినలేదన్న కేటీఆర్ వ్యాఖ్యల పై మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కేటీఆర్ కు లేఖ రాశారు. అసలు జేపీ నడ్డా ఎవరో కూడా తెలియది అనడం మీ అజ్ఞానానికి నిదర్శనమన్నారు దత్తత్రేయ. అప్పట్లో ఎయిమ్స్‌, ఫార్మాసిటీ కోసం నడ్డాను కలిసిన విషయం మర్చిపోయారా? అని కేటీఆర్‌ని ప్రశ్నించారు. అసలు టీఆర్‌ఎస్ అంటే అబద్దాల పుట్ట అని దత్తత్రేయ మండిపడ్డారు.

తెలంగాణలో బీజేపీ బలపడుతోంటే టీఆర్‌ఎస్‌ నేతల్లో అసహనం పెరిగిపోతోందని లేఖలో దత్తత్రేయ పేర్కొన్నారు. అయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ గొప్పదైతే పేదలకు వైద్యం ఎందుకు అందడం లేదు? అని ప్రశ్నించారు. జేపీ నడ్డా కాదు అబద్దాల అడ్డా అంటూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాపై కేటీఆర్ సెటైర్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండారు దత్తత్రేయ లేఖ రాశారు. ఈ లేఖపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తత్రేయ ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story