బాలయ్య ఫ్యామిలీకి ఫోర్జరీ షాక్

బాలయ్య ఫ్యామిలీకి ఫోర్జరీ షాక్
x
బాలయ్య ఫ్యామిలీకి ఫోర్జరీ షాక్
Highlights

మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిన కొర్రి శివను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న హైదరాబాద్,...

మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిన కొర్రి శివను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న హైదరాబాద్, బంజారాహిల్స్ బ్యాంకు మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్‌లు వసుంధర ప్రతినిధి వెలగల సుబ్బారావుకు ఫోన్ చేసి, వసుంధర మొబైల్ బ్యాంకింగ్ యాప్ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెబుతూ, యాక్టివేట్ చేయమంటారా? అని అడిగారు.

తామేమీ మొబైల్ బ్యాంకింగ్‌ను కోరలేదని అంటూ, ఈ విషయాన్ని వసుంధర దృష్టికి తీసుకెళ్లగా, ఆమె సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. దీంతో అధికారులు విచారించగా, బాలకృష్ణ వద్ద కొత్తగా ఉద్యోగంలో చేరిన జూనియర్ అకౌంటెంట్ కొర్రి శివ ఈ పని చేసినట్టు తేలింది. దీంతో అతన్ని నిలదీయగా, ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు అంగీకరించాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివపై క్రిమినల్ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories