Top
logo

కేసీఆర్‌‌పై అశ్వద్ధామరెడ్డి ఘాటు విమర్శలు

కేసీఆర్‌‌పై అశ్వద్ధామరెడ్డి ఘాటు విమర్శలు
Highlights

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి... సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై...

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి... సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనతో మాట్లాడారన్న అశ్వద్ధామరెడ్డి.... ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల బాధలను చూసి... పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్టీఆర్ కంటే కేసీఆర్ ఛరిష్మా ఉన్న నాయకుడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన అశ్వద్ధామరెడ్డి.... పరిస్థితి ఇలాగే కొనసాగితే.... 1995 తరహా రాజ్యాంగ సంక్షోభం వచ్చినా రావొచ్చన్నారు.

Next Story