సమావేశాన్ని శాంతియుతంగా జరిపించండి : అశ్వత్థామరెడ్డి

సమావేశాన్ని శాంతియుతంగా జరిపించండి : అశ్వత్థామరెడ్డి
x
అశ్వత్థామరెడ్డి
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను రేపు జరగబోయే సమావేశానికి ఆహ్యానించిన సంగతి అందరికీ విదితమే. ఈ సంర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను రేపు జరగబోయే సమావేశానికి ఆహ్యానించిన సంగతి అందరికీ విదితమే. ఈ సంర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 53 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

రేపు జరగబోయే సమావేశంలో ప్రభుత్వం కార్మికుల 26 డిమాండ్లపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుని కార్మికులను ఆదుకోవాలని, వారికి తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రతి డిపోనుంచి ఐదుగురు కార్మికులను ఆ సమావేశానికి పంపించమని సీఎం ఆదేశాలు జారీ చేయగా అమాయక కార్మికులను ఎంచుకుని సమావేశానికి పంపిస్తున్నారని ఆరోపించారు.

ఈ సమావేశాన్ని శాంతియుతంగా జరపాలని ఆయన కోరారు. సెక‌్షన్‌ 19 ప్రకారం ఎవరైనా ట్రేడ్‌ యూనియన్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన వెల్లడి చేశారు. భారత రాజ్యాంగం కార్మికుల కోసం రాసిన హక్కుల ప్రకారమే కార్మిక సంఘాలు నడుచుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం కోర్టు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని కార్మికులను ఈ సందర్భంగా ఆయన కోరారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories