Top
logo

ఈ రాత్రి వరకు కార్మికులు హైదరాబాద్‌కు తరలిరావాలి : అశ్వత్థామరెడ్డి

ఈ రాత్రి వరకు కార్మికులు హైదరాబాద్‌కు తరలిరావాలి : అశ్వత్థామరెడ్డి
X
Highlights

సకల జనుల సామూహిక దీక్షలు అడ్డుకునేందుకు ప్రభుత్వం నిర్బంధానికి పాల్పడుతుందని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ...

సకల జనుల సామూహిక దీక్షలు అడ్డుకునేందుకు ప్రభుత్వం నిర్బంధానికి పాల్పడుతుందని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. కార్మికుల ఇళ్లలో పోలీసులు దాడులు చేస్తూ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. మహిళా కార్మికులను కూడా అరెస్ట్ లు చేస్తున్నారని చెప్పారు. దమనకాండను పోలీసులు వెంటనే నిలిపివేయాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా సకల జనుల సామూహిక దీక్షలు కార్యక్రమం జరిగితీరుందని స్పష్టం చేశారు. ఈ రోజు రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులు హైదరాబాద్ కు తరలిరావాలని అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు.

Next Story