మెట్రో అధికారులపై ఓవైసీ ఫైర్

మెట్రో అధికారులపై ఓవైసీ ఫైర్
x
Highlights

హైదరాబాద్ నగరంలో ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు మెట్రో లైన్ పూర్తయిన విషయం అందరికీ తెలిసిందే.

హైదరాబాద్ నగరంలో ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు మెట్రో లైన్ పూర్తయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కారిడార్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నారు. రోడ్డు మార్గం గుండా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కు దాదాపుగా 40 నిమిషాలు సమయం పడుతుందని, అదే మెట్రో రైలులో అయితే కేవలం 15 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు యాజమాన్యం ట్వీట్ చేయడంతో దానికి ఎంఐఎం అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. మెట్రో లైన్ పనుల మీద మెట్రో రైలు యాజమాన్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నామా మార్గం నిర్మాణ దశలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్పందించి ఓవైసీ ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ వరకు మెట్రో పనులు పూర్తి చేశారు కానీ, ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నామా వరకు మెట్రో లైన్ పూర్తి చేయరా అని ప్రశ్నించారు. దక్షిణ హైదరాబాద్‌ విషయంలో మెట్రో చిన్న చూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మార్గాన్ని పూర్తి చేయడానికి నిధులు ఉన్నాయి కానీ ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నామా వరకు పనులు చేయడానికి నిధులు లేవా అని ప్రశ్నించారు. నగరంలో 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్‌ ను నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ ఇప్పటికే హైదరాబాద్‌లో మెట్రోరైల్‌ నిర్మాణం మొత్తం పూర్తయినట్లే అని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories