Top
logo

చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి వ్యతిరేకంగా నాయకుల అరెస్ట్

చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి వ్యతిరేకంగా నాయకుల అరెస్ట్
Highlights

తెలంగాణలో రాష్ర్ట వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఐకాస పిలుపునిచ్చిన 'సకల జనుల సామూహిక దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు.

తెలంగాణలో రాష్ర్ట వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఐకాస పిలుపునిచ్చిన 'సకల జనుల సామూహిక దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ దీక్ష కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ట్యాంక్ బండ్ పైకి పోలీసులు భారీగా మోహరించారు. అంతే కాకుండా నగరంలోని అన్ని మార్గాలను వారి నియంత్రణలో తీసుకున్నారు. ఏ యే ప్రాంతాల నుంచి వాహణాలు రోడ్ల పైకి వచ్చినా ఆ వాహణాలను తనిఖీ చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలను భారీగా విధించారు. మరికొన్ని మార్గాల్లో వచ్చే వాహానాల రాకపోకలను దారి మళ్లించారు. చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఆర్టీసీ ఐకాస నేతలను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు.

వారితో పాటుగానే గచ్చిబౌలి హెచ్‌సీయూ డిపోకు చెందిన ముగ్గురిని, ఫారూఖ్‌నగర్‌ డిపోకు చెందిన వారిలో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారితో పాటుగా జీడిమెట్లలో సీపీఎం నాయకులను, అంబర్‌ పేట్‌లో మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్యను, రామాంతపూర్‌ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత ఎన్వీఎన్‌ఎన్‌ ప్రభాకర్‌, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ, భాజాపా నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తెదేపా సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు, గృహనిర్బంధం చేశారు.Next Story