తెలంగాణ మున్సిపోల్స్: ముమ్మర ఏర్పాట్లు!

తెలంగాణ మున్సిపోల్స్: ముమ్మర ఏర్పాట్లు!
x
Highlights

రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పురపాలక ఎన్నికల సమయం దగ్గరి కొచ్చేసింది.

రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పురపాలక ఎన్నికల సమయం దగ్గరి కొచ్చేసింది. ఎన్నికల సమరం మొదలు కావడానికి ఇంకా కొంత సమయమే ఉంది. దీంతో పోటీలో పాల్గొనే అభ్యర్థులు తమ ఏర్పాట్లలో ఉంటే, అధికారులు కూడా వారి వారి ఏర్పాట్లలో ఉన్నారు. ఇదే కోణంలో ఎన్నికల సమయంలో ఓటర్లు కానీ, అభ్యర్థలు కానీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి పకడ్బందీగా ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ వి.నాగిరెడ్డి కలెక్టర్ లను ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. వార్డుల వారీగా ఉన్న ఎన్నికల ఓటర్ల జాబితాను తయారు చేయాలని తెలిపారు. ఎన్నికలకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని వాటిని స్ట్రాంగ్ రూంలలో భద్రపరచాలని తెలిపారు. జనవరి 14న పోటీలో పాల్గొనే అభ్యర్థుల జాబితా ఖరారైన వెంటనే బ్యాలెట్ పత్రాలను ముద్రించాలని తెలిపారు. అనంతరం ఆ ఏర్పాట్లను పరిశీలించాలని తెలిపారు.

బ్యాలెట్ పత్రాలపైన అభ్యర్థుల గుర్తులతో పాటుగా పేర్లను కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. రిటర్నింగ్ అధికారలుకు, వారితో పాటు సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ తెలిపిన విషయాలకు కలెక్టర్లందరూ ఏకీభవించారు. ప్రస్తుతం 10 కార్పోరేషన్లు, 120 నగరపాలక సంస్థల్లో ప్రాథమిక అంచనాల మేరకు దాదాపుగా 53 లక్షల మంది ఉంటారని ఆ సందర్భంగా ఆ‍యన తెలిపారు. వీటికి అనుగుణంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఒక్కోదాన్లో గరిష్టంగా 800 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేయాలనితెలిపారు.

పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ నిర్వహించాలని తెలిపారు. ఈ నేపథ‌్యంలోనే ఎన్నికల పరిశీలకుల సంఘాన్ని కూడా ఏర్పాట్లు చేసారు. వీరికి వాహన సౌకర్యం, వసతి, భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక ఈ ఎన్నికల షెడ్యూల్ విషయానికొస్తే

జనవరి 4వ తేదీన పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రారంభించనున్నారు.

♦ జనవరి 5న ముసాయిదాను ప్రచురించనున్నారు.

♦ జరవరి 7వ తేదీన మున్సిపాలిటీల వారీగా రాజకీయ పార్టీలతో సమావేశం జరపనున్నారు.

♦ జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ అభ్యంతరాలు, సూచనలను ఇవ్వడానికి గడువు.

♦ జనవరి 9వ తేదీన అభ్యంతరాలను పరిష్కరించనున్నారు.

♦ జనవరి 10వ తేదీన పోలింగ్ కేంద్రాలకు జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ల అనుమతి ఇవ్వనున్నారు.

♦ జనవరి 13వ తేదీన మున్సిపల్ కమిషనర్లతో పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories