నిఫ్ట్ స్కాలర్‌ షిప్‌ టెస్టులకు దరఖాస్తుల స్వీకరణ

నిఫ్ట్ స్కాలర్‌ షిప్‌ టెస్టులకు దరఖాస్తుల స్వీకరణ
x
Highlights

ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు చేయూత నిచ్చేందుకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ (నిఫ్ట్) ఆధ్వర్యంలో వివిధ కోర్సులను...

ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు చేయూత నిచ్చేందుకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ (నిఫ్ట్) ఆధ్వర్యంలో వివిధ కోర్సులను అందిస్తున్నట్లు నిఫ్ట్‌ అకాడమిక్‌ డైరెక్టర్‌ కె.రాముయాదవ్‌. ఈ నేపథ్యంలో శనివారం తుకారాంగేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి విద్య కోర్సులకు బంగారు భవిష్యత్‌ ఉందని అన్నారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియల్‌ డిజైనింగ్‌ కోర్సుల బ్యాచ్‌కు 2020 ఫిబ్రవరి 3వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌, స్వయం ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు.

డిప్లొమా, పీజీ డిప్లొమా, బీబీఏతో కూడిన ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులలో చేరేందుకు పదవ తరగతి, ఇంటర్‌, డిగ్రీ పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన వారు కూడా చేయవచ్చునని ఆయన అన్నారు. ఈ నెల 10వ తేదీన జరుగబోయే పరీక్షకు ఫోన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునని స్పష్టం చేసారు. ఆసక్తి గలవారు 9030610011/22/55 సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో ఫ్యాషన్‌ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని, అదే విధంగా ఈ కోర్సులను గ్రామీణ యువతకి కూడా అందించాలన్నదే నిఫ్ట్‌ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories