విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతాం: కిషన్ రెడ్డి

విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతాం: కిషన్ రెడ్డి
x
Highlights

జమ్ముకశ్మీర్‌ తాజా పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ర్టాల విద్యార్ధులను స్వస్థలాలకు...

జమ్ముకశ్మీర్‌ తాజా పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ర్టాల విద్యార్ధులను స్వస్థలాలకు చేర్చుతామని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధికారులతో, రైల్వే, విమానయాన శాఖ అధికారులతో కిషన్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో తెలుగుప్రజల సహా మరెవరి భద్రతకు ఢోకా లేదన్నారు. జమ్ము నుంచి విద్యార్థులు, పర్యాటకులు స్వస్థలాలకు వెళ్లేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్ నిట్ క్యాంపస్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అయితే మొత్తం 135 మంది ఏపీ, తెలంగాణకు చెందిన వాళ్లున్నారు. కాలేజీ యాజమాన్యం వాళ్లకు 4 బస్సులు ఏర్పాటు చేసింది. వాటిలో జమ్మూవరకూ వెళ్లవచ్చని తెలిపింది. ఇప్పటికే వాళ్లు జమ్మూ వెళ్లిపోయారు. అక్కడి నుంచీ వాళ్లను ఢిల్లీకి పంపించింది జిల్లా యంత్రాంగం. అధికారుల చొరవతో 130 మంది తెలుగు విద్యార్థులు ప్రస్తుతం జమ్ముకు చేరుకున్నారు. ఆదివారం (ఆగస్టు 4) ఉదయం 6 గంటల లోగా వారు ఢిల్లీ చేరుకోనున్నారు. కాగా కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శ్రీనగర్ ఎన్‌ఐటీ క్యాంపస్‌ను విద్యార్థులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర సర్కార్ ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories