ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి
x
Highlights

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటకు చెందిన నాగేశ్వర్ రావు నారాయణఖేడ్ డిపోలో...

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటకు చెందిన నాగేశ్వర్ రావు నారాయణఖేడ్ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు రెండోసారి డెడ్ లైన్, ఈ నెల ఐదో తేది లోపు విధుల్లో చేరాకుంటే ఉద్యోగాలు కోల్పోయినట్లే అని టీవీల్లో ప్రభుత్వం ప్రకటనలు చూసి నాగేశ్వర్ రావు మతి స్థిమితం కోల్పోయాడు. పిచ్చిగా ప్రవర్తంచడం మొదలుపెట్టాడు.

సంగారెడ్డిలో నివాసం ఉండే నాగేశ్వర్ రావు కుటుంబం రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. పూట గడవడం కష్టం కావడంతో నాగేశ్వర్ రావు జోగిపేటలోని అత్తగారింటికి వచ్చాడు. మానసిక ప్రవర్తన సరిగా లేని నాగేశ్వర్ రావును హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకెళ్లితే పట్టించుకోలేదు. దీంతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. కొద్ది రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం నాగేశ్వర్ రావు మృతి చెందాడు. నాగేశ్వర్ రావు మృతదేహాన్ని ఆయన స్వస్థలం జోగిపేటకు అంబులెన్స్ లో తీసుకొచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. జోగిపేటకు నారాయణ ఖేడ్ డిపో కార్మికులు తరలివస్తుండడంతో నాగేశ్వర్ రావు ఇంటి వద్ద పోలీసులు భద్రత కల్పించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories