అమ్మ ఒంటరైంది.. ఇప్పుడు ఆమెకు తోడుగా నిలిచేదెవరు..?

అమ్మ ఒంటరైంది.. ఇప్పుడు ఆమెకు తోడుగా నిలిచేదెవరు..?
x
అమ్మ ఒంటరైంది.. ఇప్పుడు ఆమెకు తోడుగా నిలిచేదెవరు..?
Highlights

ఆయనకు ఒక్కతే కూతురు. తన ఆరాటం అంతా ఆమె కోసమే. కూతురంటే వల్లమాలిన ప్రేమ. ఆమెకు చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేదు. ఇంతగా ఇష్టం పెంచుకున్న కూతురు తనను...

ఆయనకు ఒక్కతే కూతురు. తన ఆరాటం అంతా ఆమె కోసమే. కూతురంటే వల్లమాలిన ప్రేమ. ఆమెకు చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేదు. ఇంతగా ఇష్టం పెంచుకున్న కూతురు తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేక పోయాడు. తన కూతురు మీద ఉన్న ఇష్టం కోపంగా మారింది. ఇంకేముంది తన కూతురి మనసు మార్చాలనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు తన కూతురిని తనకు కాకుండా చేసిన వ్యక్తిని హత్య చేయించాడనే ఆరోపణాలు ఎదుర్కోన్నాడు. దానికి జైలుకెళ్లి బెయిల్ మీద వచ్చాడు. అప్పట్లో కూతురు విషయంలో జైలుకెళ్లొచ్చిన మారుతీరావు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని భార్యను ఒంటరిని చేశాడు.

ఒక్క హత్య..రెండు కుటుంబాలు చిన్నాభిన్నం చేసింది. పరువు పగ..కూతురు కలలు కన్న జీవితాన్నిచెరిపేసింది. చచ్చేంతా ప్రేమ.. పశ్చాతాపం.. చివరకు ఆత్మహత్య చేసుకునేలా చేసింది. చివరకు అటు భర్తలేక..ఇటు కూతురు దూరమై...అమ్మ ఒంటరైంది.

మారుతీరావు కు కూతురు అంటే చచ్చేంత ప్రేమ. ఆమే జీవితం ఆమే తన ప్రపంచం అనుకున్నాడు. గారాల పట్టీని గుండెలపైఎత్తుకుని పెంచాడు. ఇలా ప్రేమగా చూసుకుంటున్న కూతురుని పెద్దయ్యాక ప్రేమే ఎగురేసుకుపోతుందని ఊహించలేదు. ఇంతలోనే ప్రేమ అనే రెండక్షరాలు తన కనుపాపని ఎగురేసుకుపోయాయి. ఇది చూసిన ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురు అమృతని ప్రేమించిన ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఇలా మారుతీరావు జైలుకెళ్లి కొన్ని నెలల క్రితం బెయిల్‌పై వచ్చాడు.

ఒకపక్కన అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు దూరం కావడం మరోపక్కన భర్త జైలులో ఉండడం ఆ తల్లి నరకం చూసింది. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి గిరిజాకు వచ్చింది. నా అనుకున్న వాళ్లే గిరిజాకు లేకుండా పోయారు ఇప్పుడు ఆమె భర్త మారుతి రావు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె జీవితం అగమ్యగోచరంగా మారింది. తన కూతురు విషయంలో జరిగిన దారుణం గురించి ఆమె ఎక్కడ మాట్లాడలేదు. ఉన్న ఒక్కగాని ఒక్క కూతురు జీవితం ఇలా మారిందని కన్నీళ్లను దిగమింగింది కానీ, ఎక్కడ నోరు విప్పలేదు.

ఏడాదిన్నరగా కూతురితో మాట్లాడేందుకు గిరిజా పడిన తపన అంత ఇంత కాదు. అయినా ఆ కూతురి మనసు మారలేదు. తన కూతురి కోసం ఆ తల్లి ఎన్నో చేసింది. కానీ, అమృతవర్షిణీ మాత్రం తల్లి ప్రేమను మరిచింది. ఇప్పుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె పరిస్థితి ప్రశ్నర్థకంగా మారింది..? ఒక ప్రేమ రెండు ప్రాణాలను తీసింది. రెండు కుటుంబాలను చిన్నభిన్నం చేసింది. ఆ ఇంటి ఇల్లాలు ఒంటరిగా మిగిలింది. కూతురి కోసం ఆ తల్లి ఎంత తపన పడుతుందో మారుతీరావు రాసిన సూసైడ్ లెటర్ చూస్తనే అర్ధం అవుతుంది.

అమృత ప్రేమ విషయంలో ప్రియుడిని చంపి నిందితుడు అయ్యాడు మారుతీరావు. ఈ కేసులో నిందితుడు అతడే బాధితుడు మారుతీరావునే. కూతురు జీవితాన్ని నాశనం చేసి నిందితుడిగా మారితే ఒక్కగాని ఒక్క కూతురు దూరం కావడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఒక ప్రేమ ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. రెండు కుటుంబాలను చిన్నభిన్నం చేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు జీవితం నాశనం అయిందని ఆ తల్లీ కన్నీళ్లను రెప్పచాటునే దాచుకుంది. చివరకు తోడు ఉంటానని చెప్పిన భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఒంటరిగా మారింది.

ఇటు కూతురు, అటు భర్త ఇద్దరూ దూరం కావడంతో మారుతీరావు భార్య గిరిజా ఒంటరి అయింది. తన అనుకున్న వాళ్లను తనకు దూరం కావడంతో ఆమె బాధ వర్ణాణతీతంగా మారింది. ఇప్పుడు ఆమెకు తోడుగా నిలిచేదెవరు ఆమె బాధను పట్టించుకునేది ఎవరు..? ఆమె కోసం ఆలోచించేది ఎవరు..?

మారుతీరావు చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్‌ రాశారు. గిరిజా క్షమించు అమృతా అమ్మ దగ్గరకు రా అని రాశాడు. అంటే తన కూతురు మీద తన భార్యకు ఎంత ప్రేమ ఉందో ఈ లెటర్ కళ్లకు కడుతోంది. మారుతీరావు చనిపోవడంతో ఆమె ఒంటరీగా మిగిలింది. తానూ అనుకున్న జీవితాన్ని ఇవ్వలేదన్న కోపం ఒకరిదైతే పరువు కోసం కూతురి జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిత్వం మరోకరిది చివరకు ఫలితం ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఒకరికి తోడు లేకుండా పోయారు. ప్రేమను బతికించుకోవడం కోసం తండ్రి మీదే కేసులు పెట్టింది అమృత. తాను చేసిన పనికి పశ్చాత్తాప పడిన ఫలితం లేదని మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏది ఏదైనా ఒక ప్రేమ ఇద్దరిని బలి తీసుకుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories