ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
x
Highlights

హైదరాబాద్ నేషనల్‌ పోలీస్ అకాడమీలో ఈనెల 24న కొత్త ఐపీఎస్‌ ల పాసింగ్ ఔట్ పరేడ్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

హైదరాబాద్ నేషనల్‌ పోలీస్ అకాడమీలో ఈనెల 24న కొత్త ఐపీఎస్‌ ల పాసింగ్ ఔట్ పరేడ్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అకాడమీలో మొత్తం 92 మంది యువ ఐపీఎస్‌ అధికారులు 42 వారాలపాటు శిక్షణను పూర్తిచేసుకున్నారు. హైదరాబాద్ శివరాంపల్లిలోని 70వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.. ఈనెల 24కొత్త పాసింగ్ ఔట్ పరేడ్ జరపనున్నారు. 70వ బ్యాచ్‌లో మొత్తం 92 మంది ఐపీఎస్‌లు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. అందులో 12 మంది మహిళా ఐపీఎస్ లు ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఆరుగురు ఐపీఎస్ లను కేటాయించారు. ముగ్గురు తెలంగాణా, మరో ముగ్గురు ఆంద్ర ప్రదేశ్ క్యాడర్‌లో ఉన్నారు.

ఇక మన దేశం తో పాటు భూటాన్ , నేపాల్ కి చెందినా పోలిస్ ఆఫీసర్లు కూడా నేషనల్ పోలీస్ అకాడమి లోనే శిక్షణ తీసుకున్నారు.. ఆరుగురు భూటాన్, ఐదుగురు నేపాల్‌కి చెందినా ఆఫీసుర్లు ఉన్నారు.. 70వ ట్రైనింగ్ ఐపీఎస్ బ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఢిల్లీకి చెందిన గౌష్ ఆలం కు తెలంగాణా కేడర్ కేటాయించారు. 42 వారాలు కఠోర శిక్షణ పూర్తి చేసి ప్రతిభ కనబర్చిన ఎనిమిది మంది ఐపీఎస్ లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులు మీదుగా మెడల్స్ అందజేయనున్నారు. 42 వారాలు పాటు శిక్షణ పూర్తి చేసుకొని మరో రెండు రోజుల్లో ఐపీఎస్ లు బాద్యతలు తీసుకోనున్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ ఎంటో కఠినమైనదని యువ ఐపీఎస్ లు చెబుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories