హుజూర్‌నగర్‌లో వేడెక్కిన వాతావరణం

హుజూర్‌నగర్‌లో వేడెక్కిన వాతావరణం
x
Highlights

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికకు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు....

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికకు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా గరేడేపల్లి మండలం వెలదండ గ్రామంలో' ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ను చూస్తేనే ఢిల్లీ పార్టీలకు వణుకు పుడుతుందన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. అందుకే సిద్ధాంతాలను వదిలి పెట్టి కాంగ్రెస్, బీజేపీలు వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. ఎవరెన్ని వేషాలు వేసినా చివరికి హుజూర్‌నగర్‌లో ఎగిరేది గులాబీ జెండాయేనన్నారు.

గరిడేపల్లి మండలం కుతుబ్ షాపురం, గడ్డిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. హుజూర్‌నగర్‌, కోదాడ ప్రాంతాల్లో అభివృద్ధి ఈ స్థాయిలో జరగడానికి కారణం కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. నియోజకవర్గ ఆడబిడ్డ, కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇక ఉప‌ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి కోటా రామారావుకు‌ మద్దతుగా బీజేపీ నాయకుడు వివేక్ ప్రచారంలో పాల్గొన్నారు. పాలకీడు మండలంలో ప్రచారం పాల్గొన్న నాయకులు హుజుర్‌నగర్‌లో‌ బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతాయన్నారు.

మేళ్లచెరువు మండల కేంద్రంలో టీడీపీ అభ్యర్థి చావా కిరణ్‌మయ్‌తో పాటు ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ. రాష్ట్రంలో అభివృద్ధి దారుణంగా కుంటుపడిందన్న రమణ టీడీపీకి ఓటేసి గెలిపిస్తే ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. మొత్తానికి పోటాపోటీ ప్రచారాలతో హుజూర్‌నగర్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories