పోలీస్‌ స్టేషన్‌లో మద్యం చోరీ

పోలీస్‌ స్టేషన్‌లో మద్యం చోరీ
x
Highlights

దొంగతనాలు సాధారణంగా ఇండ్లలోనో, షాపులలోనో, బస్సుల్లో, బస్టాప్ లలో ఎక్కువగా జరుగుతుంటాయి.

దొంగతనాలు సాధారణంగా ఇండ్లలోనో, షాపులలోనో, బస్సుల్లో, బస్టాప్ లలో ఎక్కువగా జరుగుతుంటాయి. అప్పుడు బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇస్తే వారు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపి నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తారు. మరి అలాంటి రక్షకులు ఉన్న నిలయంలోనే చోరీ జరిగే ఎలా ఉంటుంది. ఇలాంటి సంఘటనే కరీంనగర్‌లో చోటు చేసుకుంది.

పూర్తివివరాల్లొకెళితే కరీంనగర్లోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఈ చోరీఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ లో చాలా మంది అక్రమంగా మద్యం అమ్ముతుండడంతో పట్టణ పోలీసులు వారిపై దాడులు చేసారు. ఆ సరుకును పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో భద్రంగా ఉంచారు. అయితే, పోలీస్ స్టేషన్‌లో ఉంచిన మద్యం నిల్వలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాక స్టేషన్ లోని పోలీసులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌లోనే చోరీ అంటే పరువు పోతుందని పోలీసులు నోరు విప్పడం లేదు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలోని మద్యం షాపులకు తెరవొచ్చని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడంతో షాపుల మందు మందుబాబులు క్యూలు కడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories