మందుబాబులకు మరో షాక్..14 వరకు మద్యం దుకాణాలు బంద్‌

మందుబాబులకు మరో షాక్..14 వరకు మద్యం దుకాణాలు బంద్‌
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.ఏప్రిల్ 1వ తేది ఎప్పుడొస్తుందా, ఎప్పుడు వైన్ షాపులు తెరుచుకుంటాయా అని ఎదురు చూసే మద్యం ప్రియుల ఆశలకు చెక్ పెట్టింది. ఏప్రిల్ 14వ తేదీ వరకు వైన్ షాపులకు తెరిచే ప్రసక్తే లేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 14వ తేది వరకు రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు, బార్లు, క్ల‌బ్స్, టూరిజం బార్లు, క‌ల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయం లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్లు, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ముందు ప్రకటించిన లాక్ డౌన్ తేదీ నిన్నటికి ముగిసింది. దీంతో బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరుస్తారని, అమ్మకాలు జరుగుతాయని ప్రచారం జరిగింది. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 14వ తేది వరకు దుకానాలు తెరవమని ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసి మద్యం ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది.

ఇక రెండు వారాలుగా మందుబాబులకు మద్యం లభించక పోవడంతో వారి పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఒక్క సారిగా మద్యం ఆపే సరికి వారి మానసిక పరిస్థితి సరిగ్గా లేక వింత ప్రవర్తనలు, పిచ్చి ప్రవర్తనుల చేస్తున్నారు. వారిని హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. కాగా ఎర్రగడ్డ ఆస్పత్రిలో మంగళవారం ఒక్క రోజే 198 మంది ఔట్‌ పేషెంట్లు వచ్చారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఇక తాజాగా తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 97కు చేరింది. మంగళవారం కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మర్కజ్ నుంచి వచ్చిన వారికి, వారి బంధువులకు కోవిడ్ సోకిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. ప్రస్తుతానికి 77 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక ఇప్పటికే ఈ వ్యాదిన పది ఆరుగురు చనిపోయారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories