మరో రెండేళ్లపాటు నూతన కళాశాలలకు నో పర్మీషన్

మరో రెండేళ్లపాటు నూతన కళాశాలలకు నో పర్మీషన్
x
Highlights

దేశ వ్యాప్తంగా రోజు రోజుకు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా రోజు రోజుకు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం ప్రస్తుతం ప్రతి విద్యార్థి ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, మిషన్‌ లెర్నింగ్, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులను అబ్యసించడానికే ఎక్కువ చొరవ చూపుతున్నారు. ఈ కారణంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు 40 శాతానికి పైగా భర్తీ కావడం లేదని స్పష్టం చేసారు.

ఇక పోతే 2019–20 విద్యా సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలల్లో మొత్తం 27 లక్షలు సీట్లు ఉంటే వాటిలో కేవలం 13లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని, 14 లక్షల సీట్లు అలాగే మిగిలిపోయాలయిన తెలిపారు. రాష్ట్రంలో చూసుకుంటే 217 కాళాశాలల్లో 1,12,090 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలుపగా, 187 కాలేజీల్లో 93,790 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. వీటిలో కేవలం 62,744 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ పరిస్థితి మన రాష్ట్రంలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇంజనీరింగ్ విభాగంలోనే కాకుండా ఫార్మసీలోనూ ఇలాంటి పరిస్థి తే సాగుతుంది.

ఆ కారణంగానే వచ్చే రెండేళ్లలో అంటే 2020–21 విద్యా సంవత్సరంతోపాటు 2021–22, 2022–23 విద్యా సంవత్సరం వరకు కొత్త కాలేజీల లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ) కూడా ఇవ్వబోమని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్పష్టం చేసింది. గతంలో ఎల్‌వోఐ ఇచ్చిన వారికి మాత్రం లెటర్‌ ఆఫ్‌ అప్రూవల్‌ (ఎల్‌వోఏ) ఇస్తామని స్పష్టం చేసింది. ఇక ఈ విద్యాసంవత్సరంలో జారీ చేసిన నూతన సాంకేతిక విద్యా సంస్థల అప్రూవల్‌ హ్యాండ్‌బుక్‌లో మార్పులపై ఇటీవల ఢిల్లీ, చెన్నైలో జరిగిన కన్సల్టేషన్‌ సమావేశాల్లో ఈ నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు ప్రభుత్వ రంగంలో కొత్త కళాశాలల ఏర్పాటుకు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలో నూ కొత్త కాలేజీల ఏర్పాటుకు ఎల్‌వోఐ ఇస్తామని, మిగతా వాటికి ఇవ్వబోమని తేల్చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories