'ముత్తైదువులు పసుపుకొమ్ములు కట్టుకోవాలి' వార్త నిజం కాదు

ముత్తైదువులు పసుపుకొమ్ములు కట్టుకోవాలి వార్త నిజం కాదు
x
Highlights

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎన్నో వదంతులు, ఫేక్ వార్తలు, మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎన్నో వదంతులు, ఫేక్ వార్తలు, మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను ఎక్కువగానే వ్యాప్తి చెందుతున్నాయి. ఇలా చేస్తే కరోనా రాదు, అలా చేస్తే కరోనా రాదు అనే ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నాయి. ఓ వైపు అలాంటి ఫేక్ వార్తలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ ప్రజలు తప్పుడు సమాచారాన్నే ఎక్కువగా నమ్ముతున్నారు. మరో అధికారులు, వైద్యులు, ప్రభుత్వం కూడా తప్పుడు సమాచారాన్ని నమ్మెద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు.

అయినా రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మూఢనమ్మకాల ప్రచారం మాత్రం బాగానే జరుగుతుంది. మొన్నటికి మొన్న వేపచెట్టుకు, గ్రామదేవతలకు పూజలు చేస్తే కరోనా రాదని వచ్చిన వార్తను నమ్మి ఎంతో మంది మహిళలు పూజలు చేసారు. అలాగే ఒక్క కొడుకు ఉన్న తల్లులు ఐదు ఇళ్ల బావుల్లోని నీటిని వేపచెట్టుకు పోస్తే కరోనా పారిపోతుందనే వింత ప్రచారం జరిగింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున్న మహిళలు వేప చెట్టుకు ఐదు బావుల నీళ్లు పోసి పూజలు చేసారు. అలాగే గుండ్లు కొట్టించుకుంటే కరోనా రాదనే వార్త ప్రచారంలోకి రావడంతో ఓ గ్రామ యువకులు వరుసగా గుండ్లు కొట్టించుకుంటున్నారు.

ఇప్పుడు ఇదే నేపథ్యంలో ముత్తయిదువులు పసుపు కొమ్మును ధరించాలని, చినజీయర్ స్వామి చెప్పారనే వదంతు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో చాలా మంది మహిళలు పసుపుకొమ్ములను ఏడు దారాలకు కట్టుకుని మెడలో ధరించారు. వారు ధరించడం మాత్రమే కాకుండా తమ బంధువులకు కూడా ఈ విషయాన్ని చేరవేసి వారు కూడా కట్టుకునేలా చెప్పారు. అయితే ఈ వీడియో చూసిన శ్రీఅహోబిల జీయర్‌ స్వామి స్పందించారు.

ఈ వార్తలో నిజం లేదని, అది అవాస్తవం అని చినజీయర్ స్వామి ఆ విధంగా చెప్పలేదని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముత్తైదువులు కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఏడు దారాలతో పుసుపుకొమ్ములు అమావాస్యలోపు ధరించి, అమావాస్య తర్వాత తీసివేయాలని అని ప్రచారం అయ్యే వార్తను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేసారు. కరోనా వైరస్ ను అడ్డుకోవాలంటే ప్రభుత్వాలు చెప్పిన నిబంధనలను పాటించడమే ఉత్తమం అని తెలిపారు. మనసును భయం నుంచి బయటకు తీసుకువచ్చి మనశ్శాంతిగా ఉంచుకోవాలంటే భగవంతుడిని ధ్యానించాలని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories