పెళ్లికి అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చిన ఏఈవో

పెళ్లికి అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చిన ఏఈవో
x
Highlights

లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. దీనివలన పెళ్ళిళ్ళు, వేడుకలకి కూడా బ్రేక్ పడింది. అందులో భాగంగా ఓ ప్రభుత్వ ఉద్యోగికి లాక్ డౌన్ ప్రకటించకముందే...

లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. దీనివలన పెళ్ళిళ్ళు, వేడుకలకి కూడా బ్రేక్ పడింది. అందులో భాగంగా ఓ ప్రభుత్వ ఉద్యోగికి లాక్ డౌన్ ప్రకటించకముందే పెళ్లి ఫిక్స్ అయింది. ఇంతలోనే కరోనా మహమ్మారి దేశంలోకి రావడం, కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించడం చకచక జరిగిపోయాయి. దీనితో తన పెళ్లిని నిరాడంబరంగా జరుపుకోవాలనుకున్నాడు. కానీ అల చేసుకుంటే విలువేముంది అనుకున్నాడో ఏమో కానీ ఆ పెళ్ళికి అయ్యే ఖర్చును ఓ మంచి పనికి వాడాలి అనుకున్నాడు.

ఇంతలోనే అతనికి ఓ ఉపాయం వచ్చింది. ఆ మొత్తాన్ని కరోనా పోరుకు సీఎం సహాయ నిధికి అందజేయాలి అనుకున్నాడు. అనుకున్నదే పనిగా మంత్రి హరీశ్‌రావు సమక్షంలో జిల్లా కలెక్టర్‌కు రూ.2లక్షల చెక్కును అందజేశారు. ఇంతకి అతను ఎవరంటే సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన సంతోష్‌ కుమార్‌ .. ప్రస్తుతం ఏఈవోగా పనిచేస్తున్నాడు. అతనికి ఆదివారం ఉదయం శిరీషతో సంతోష్‌ వివాహం జరిగింది. అతని వివాహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories