Top
logo

సర్పంచ్ ఆధ్వర్యంలో జలదీక్ష

సర్పంచ్ ఆధ్వర్యంలో జలదీక్ష
Highlights

ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం రాంపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ రేణుబాయి ఆధ్వర్యంలో గ్రామస్తులు జలదీక్ష చేపట్టారు....

ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం రాంపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ రేణుబాయి ఆధ్వర్యంలో గ్రామస్తులు జలదీక్ష చేపట్టారు. కొన్నేళ్లుగా వర్షాకాలంలో గ్రామంలో ఉన్న వాగు ఉప్పొంగుతుంది. దీంతో ఆ గ్రామానికి బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా అధికారులకు మొరపెట్టుకున్నా లాభం లేకపోవడంతో నడుం లోతు నీటిలో నిరసన తెలిపారు. వానాకాలంలో సకాలంలో ఆస్పత్రులకు వెళ్లలేక పదుల సంఖ్యలో గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారని రేణుబాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవాలని వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story

లైవ్ టీవి


Share it