శభాష్ : కరోనాని అరికట్టేందుకు సామాన్య రైతు పెద్ద సహాయం

శభాష్ : కరోనాని అరికట్టేందుకు సామాన్య రైతు పెద్ద సహాయం
x
Adilabad Farmer
Highlights

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతున్నాయి.

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతున్నాయి.దీనికి ప్రజలు కూడా పూర్తి సహకారం తెలపాలని కోరుతున్నాయి. అందులో భాగంగా తమ వంతు సహాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కొందరు ప్రముఖులు విరాళం ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ రూ. 2 కోట్లు, టాలీవుడ్ హీరో నితిన్ ఏపీ, తెలంగాణకు రూ.10 లక్షల రూపాలయ చొప్పున విరాళాలును అందజేశారు.

తాజాగా ఓ సామాన్య రైతు తన వంతు సహాయంగా యాబై వేల రూపాయలను అందజేశారు. రైతు అంటే పెద్ద రైతు అనుకుంటే పొరపాటే అవుతుంది. అతనికి ఉన్నది నాలుగు ఎకరాలు మాత్రమే.. కానీ ప్రపంచానికి ఈ రోజు కష్టం వచ్చిందని, తన పిల్లల ద్వారా తెలుసుకొని తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆదిలాబాద్ జిల్లా లాండసాంగి గ్రామానికి చెందిన మోర హన్మాండ్లు బుధవారం (మార్చి 25)న తమ జిల్లా కలెక్టర్ దేవసేనను కలిసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన రూ.50,000 చెక్కు అందజేశారు..

ఇప్పుడు తాను యాబై వేల రూపాయలను ఇవ్వడం తనకి నష్టమే కావచ్చు కానీ తనని చూసి మరికొందరు ముందుకు వస్తారని, కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించుకుంటాననీ గర్వంగా చెపుతున్నాడు. తన మిత్రులకే కాదు, శత్రువులకు కూడా ఇలాంటి కష్టం రావొద్దని కోరుకుంటున్నానని నిస్వార్థం లేని హన్మండ్లు చెప్పే మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఇక డబ్బులు ఉండి ఏం జేస్తయి.. సార్ పనికొస్తయా? మనం చచ్చిపోతే.. డబ్బులు ఏం జేస్తయ్.. నా అటువంటోళ్లు ఇంకా ఎందరో సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతూన్నాని హాన్మండ్లు కోరుతున్నాడు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రపంచంలో ఇప్పటికే 20 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక భారత్లో 630 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories